AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC: పాక్‌పై గెలవాలంటే.. ఈ 5 తప్పులు రిపీట్ చేయోద్దు.. లేదంటే భారీ నష్టమే..

టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు తొలి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో జరగనుంది. ఈసారి కూడా పాక్ జట్టుపై గట్టిపోటీనే ఉంటుంది. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టుపై విజయం సాధించాలంటే భారత్ కొన్ని తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలి.

IND vs PAK T20 WC: పాక్‌పై గెలవాలంటే.. ఈ 5 తప్పులు రిపీట్ చేయోద్దు.. లేదంటే భారీ నష్టమే..
IND vs PAK T20 Records: భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 11 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ చేసినవే కావడం గమనార్హం.
Venkata Chari
|

Updated on: Oct 23, 2022 | 7:40 AM

Share

టీ20 ప్రపంచకప్ 2022లో, భారత జట్టు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. రెండు దేశాల మధ్య ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో జరగనుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అందుకు రోహిత్ బ్రిగేడ్ ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. గత ఏడాది కాలంలో రెండు పొరుగు దేశాల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీం ఇండియా రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

అదే సమయంలో ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, పాకిస్థాన్‌పై గెలవాలంటే భారత్ ఈ ఐదు తప్పులను పునరావృతం చేయకుండా ఉండాల్సిందేనని ఫ్యాన్స్, నిపుణులు చూసిన్నారు.

1. పేలవమైన ఫీల్డింగ్: టీమ్ ఇండియా ఫీల్డింగ్ ప్రపంచ స్థాయిగా పరిగణింస్తుంటారు. అయితే గతంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రత్యేకంగా ఏమీ లేదు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్‌ను జారవిడిచాడు. దాని కోసం అతను భారాన్ని భరించాల్సి వచ్చింది. ఇది కాకుండా, అనేక సందర్భాల్లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇటీవల, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు బాగా ఫీల్డింగ్ చేశారు. దీనిని పాకిస్తాన్‌పై కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

2. బ్యాడ్ స్టార్ట్‌ను నివారించడం: పాకిస్థాన్‌పై భారత బ్యాట్స్‌మెన్‌లు ఓపెనింగ్ ఓవర్లలో కష్టపడుతున్నారు. ఆసియా కప్ 2022 గ్రూప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. అదే సమయంలో గత ప్రపంచకప్‌లో కూడా ఇద్దరు ఆటగాళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ గొప్ప మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు గొప్ప ప్రారంభాన్ని ఇస్తారని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇద్దరు ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది వంటి ఆటగాడి స్పెల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నారు.

3. మిడిల్ ఓవర్లలో రన్-రేట్: ఆసియా కప్‌లోని సూపర్-ఫోర్ మ్యాచ్‌లో భారత్‌కు మంచి ఆరంభం లభించిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ, మిడిల్ ఓవర్లలో, భారత జట్టు వికెట్లు కోల్పోవడంతో పాటు రన్ రేట్ తగ్గింది. దీంతో ఆ మ్యాచ్‌లో భారత్ రెండు వందల మార్కును అందుకోలేకపోయింది. గత ప్రపంచకప్‌లో కూడా మిడిల్ ఓవర్లలో పాక్ జట్టుపై భారత ఆటగాళ్లు పోరాడుతూ కనిపించారు. ఇప్పుడు ఈ లోపాన్ని సరిదిద్దడం భారత జట్టుకు ప్రభావవంతంగా ఉంటుంది.

4. 19వ ఓవర్: 19 వ ఓవర్ భారత జట్టుకు సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్ వంటి ఆటగాళ్లకు 19వ ఓవర్ ఖరీదుగా మారిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భువీ వేసిన 19వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఇప్పుడు పాకిస్థాన్‌పై భారత జట్టు ఈ బలహీనత నుంచి బయటపడాలి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న హర్షల్ పటేల్ గొప్ప ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది.

5. రిజ్వాన్-బాబర్‌లను ముందుగానే అవుట్ చేయడం: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ భారత జట్టుపై అద్భుతంగా రాణిస్తున్నారు. గత ప్రపంచకప్‌లో వీరిద్దరూ కలిసి భారత్‌పై పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసియా కప్ 2022లో బాబర్ విఫలమైనా, రిజ్వాన్ రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతాలు చేశాడు. రాబోయే మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే బాబర్, రిజ్వాన్ జోడీని త్వరగా పెవిలియన్‌కు చేర్చాల్సి ఉంటుంది. దీని కోసం, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ప్రారంభ ఓవర్లలో స్ట్రెయిట్ లెంగ్త్-లైన్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఇద్దరు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచవచ్చు. దీంతో వారు తర్వగా వికెట్లు కోల్పోతారు.