India vs Pakistan: హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. వరుణుడే అసలు విలన్‌.. టీమిండియా ప్లేయింగ్ ఎలా ఉండొచ్చంటే?

టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ -12 లో ఇండియా, పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

India vs Pakistan: హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. వరుణుడే అసలు విలన్‌.. టీమిండియా ప్లేయింగ్ ఎలా ఉండొచ్చంటే?
India Vs Pakistan
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2022 | 6:49 AM

క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం (అక్టోబర్‌23) మధ్యాహ్నం మెల్‌బోర్న్‌ వేదికగా దాయాది జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ -12 లో ఇండియా, పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది. కాగా సూపర్-12 స్థాయి మ్యాచ్‌ల సమయంలో వర్షం కురిసినా.. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ కొనసాగుతుంది. అయితే దీనికి కూడా ఒక టైమ్ ఫ్రేమ్ ఉంది. అంటే మ్యాచ్ మొత్తం సమయం ఆధారంగా కట్ ఆఫ్ సమయం నిర్ణయించబడుతుంది. సాధారణంగా టీ20 మ్యాచ్ రెండున్నర నుంచి మూడు గంటల వ్యవధిలో పూర్తవుతుంది. ఇక్కడ మ్యాచ్ ముగిసిన తర్వాత వచ్చే చివరి అరగంటను సాధారణంగా కట్ ఆఫ్ టైమ్‌గా పరిగణిస్తారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగితే ఓవర్లలో కోత విధించి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కనీసం 5 ఓవర్ల మ్యాచైనా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. అదే సమయంలో మ్యాచ్ సమయంలో వర్షం పడితే, పూర్తి 2 పాయింట్లు పొందడానికి కనీసం 5 ఓవర్లు ఆడాలి. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డే లేదు.

డెత్ ఓవర్ల గండం నుంచి గట్టేక్కేనా?

ఇక జట్ల బలబలాల విషయానికొస్తే.. ప్రపంచకప్‌ వన్డే అయినా, టీ20 అయినా.. పాకిస్థాన్‌పై టీమ్‌ ఇండియాదే పైచేయి. అయితే గత ఏడాది జరిగిన T20 ప్రపంచ కప్‌లో పాక్‌ ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఇప్పుడీ ఓటమికి తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.తద్వారా ప్రతిష్ఠాత్మక టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా గాయంతో తప్పుకోవడంతో భారత్‌ బౌలింగ్‌ భారమంతా మహ్మద్ షమీపైనే పడింది. అలాగే భువనేశ్వర్ కుమార్‌ కూడా చాలా ఆశలు ఉన్నాయి. ముగ్గురు మేజర్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగడం ఖాయం. అయితే చివరి ఓవర్ల బలహీనతను భారత జట్టు ఎదుర్కోగలదా లేదా అనే దానిపైనే దృష్టి ఉంటుంది. బౌలింగ్ అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం కానీ బ్యాటింగ్‌లో కూడా జాగ్రత్తగా ఉండాలి. షాహీన్ షా అఫ్రిదీని భారత టాప్ ఆర్డర్ ఎదుర్కోగలదా అనేది అతిపెద్ద ప్రశ్న? ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడం అత్యంత కీలకం. టీమ్ ఇండియాలో భారీగా పరుగులు సాధిస్తే విజయం సులువవుతుంది.

ఇక గణాంకాల గురించి చెప్పాలంటే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్థాన్ 3 విజయాలు మాత్రమే సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ 6 మ్యాచ్‌ల్లో వరుసగా 5 మ్యాచ్‌లు గెలుపొందగా, గత ఏడాది పాకిస్థాన్ తొలి విజయాన్ని అందుకుంది. చివరి 3 మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే, ఇక్కడ పాకిస్తాన్ ముందుంది. అతను 2 మ్యాచ్‌లు గెలవగా, భారత్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

పిచ్‌, వాతావరణం

మెల్‌బోర్న్‌ పిచ్‌ పేస్‌కు సహకరించనుంది. ఆదివారం వర్షం పడే అవకాశాలను కొట్టిపారేయలేం. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపనుంది. మైదానం పెద్దది కావడంతో భారీ షాట్లు ఆడటం కాస్త కష్టమే.

ప్లేయింగ్ ఎలెవన్‌

భారత్

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా.

పాకిస్థాన్

బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షాన్ మసూద్, మహ్మద్ నవాజ్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం, షాదాబ్ ఖాన్, మహ్మద్ ఖాన్, మహ్మద్ ఖాన్ .

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..