AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddanna: రజినీ మేనియానా మజాకా.. దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్ ..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా హై యాక్షన్ ఓల్టేజ్‌తో రాబోతోన్న సినిమా 'పెద్దన్న'. ఈ  చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది.

Peddanna: రజినీ మేనియానా మజాకా.. దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్ ..
Super Star
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2021 | 5:24 PM

Share

Peddanna: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా హై యాక్షన్ ఓల్టేజ్‌తో రాబోతోన్న సినిమా ‘పెద్దన్న’. ఈ  చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. మన రెండు రాష్ట్రాల్లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్‌ను రిలీజ్ చేసి పండుగను ముందే తీసుకొచ్చారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో రజినీ మార్క్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. ఊరి పంచాయితీ పెద్దగా రజినీకాంత్ కనిపించబోతోన్నారు. అతని ముద్దుల చెల్లెలిగా కీర్తి సురేష్ నటించారు. ఇక రజినీ కాంత్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రెండు నిమిషాల నలభై సెక్లను ఉన్న ఈ ట్రైలర్‌లో రజినీ మేనియా మొత్తం కనిపించింది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ ట్రైలర్ రికార్డు వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఇప్పటివరకు 1.5 పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ ట్రైలర్.

‘నువ్ ఎవరన్నది.. నువ్ వెనకేసున్న ఆస్తిలోనో, నీ చుట్టూ ఉన్న మనిషుల్లోనూ లేదు..నువ్ చేసే చర్యల్లోనూ మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది.. ఇది వేదవాక్కు’, ‘న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడి దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు’, ‘ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర.. మిఠాయి కిల్లీ’ అంటూ రజినీ చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్‌లా ఉన్నాయి. ఇక క్రూరమైన విలన్‌గా జగపతి బాబు మెప్పించారు. ఇక ఈ చిత్రంలో మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా పెద్దన్న అత్యధికే థియేటర్‌లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ట్రైలర్‌ను చూస్తే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aryan Khan Drugs Case: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు మంజూరు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మరో రచ్చ.. వార్‌కు దిగిన సన్నీ, శ్రీరామ్, జెస్సీ, మానస్.. అసలు ఏమైందంటే..

S. Thaman: “డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్..” అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ పెంచుతున్న తమన్..