S. Thaman: “డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్..” అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ పెంచుతున్న తమన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారిపాట. టాలెంటెడ్ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

S. Thaman: డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్.. అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ పెంచుతున్న తమన్..
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2021 | 3:28 PM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారిపాట. టాలెంటెడ్ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాతో మొదటిసారి కీర్తిసురేష్ మహేష్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సర్కారువారి పాట సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో మహేష్ కీర్తి పై సాంగ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. . ఆ పాటకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ పాట సినిమాలో ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ గతంలో అదిరిపోయే మ్యూజిక్ అందించిన తమన్ ఈసారి కూడా అదే రేంజ్‌లో సంగీతాన్ని అందించనున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పార్ట్ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో తమన్ సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అరవింద సమేత సినిమా తర్వాత నుంచి తమన్ సంగీతం అందించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మహేష్ సర్కారు వారి పాటకు కూడా దుమ్ములేచిపోయే బీట్స్ ను రెడీ చేశారు తమన్. తాజాగా సర్కారు వారి పాట సినిమా మ్యూజిక్ కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు తమన్. “డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్.. అంటూ పోస్ట్ చేశారు తమన్”. ఇక దీపావళి కానుకగా సర్కారు వారి పాట నుంచి మొదటి సాంగ్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amala Paul: 14 లక్షలు దాటిన ఫాలోవర్స్ సంఖ్య … ఫాన్స్‌ను ఫోటోస్‌తో సర్‌ప్రైజ్ చేసిన అమలా పాల్

Shruti Haasan: బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న శృతి హాసన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Ritu Varma: రియల్ లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు?.. క్లారిటీ ఇచ్చిన ‘వరుడు కావలెను’ హీరోయిన్ రీతూ వర్మ

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..