AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: వంక పెడితే యూత్‌ గొడవ చేస్తారేమో.. రొమాంటిక్‌ సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ, కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం 'రొమాంటిక్‌'. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను పూరీ

SS Rajamouli: వంక పెడితే యూత్‌ గొడవ చేస్తారేమో.. రొమాంటిక్‌ సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
Basha Shek
|

Updated on: Oct 28, 2021 | 3:42 PM

Share

పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ, కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కలిసి సంయుక్తంగా తెరకెక్కించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్‌ 29)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ‘రొమాంటిక్‌’ సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటుచేశారు. రాజమౌళి దంపతులు, అనిల్‌ రావిపూడి, బాబీ, గోపిచంద్‌ మలినేని, మెహర్‌ రమేశ్‌, హరీష్‌ శంకర్‌, బొమ్మరిల్లు భాస్కర్‌, మోహన కృష్ణ ఇంద్రగంటి, గుణశేఖర్‌, అలీ, ఆనంద్‌ దేవరకొండ, విశ్వక్‌ సేన్‌ తదితర ప్రముఖులు ప్రీమియర్‌ షోను వీక్షించి చిత్రం బాగుందని కితాబిచ్చారు.

దర్శకుడు ధైర్యంగా సినిమాను తెరకెక్కించాడు.. ప్రీమియర్‌ షో చూశాక రాజమౌళి స్పందిస్తూ ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ‘ముసలోడివై పోయావ్‌…నీకెం తెలుస్తుంది’ అని యూత్‌ అంతా గొడవపడతారేమోనని భయంగా ఉంది. ఇది కంప్లీట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌. అనిల్‌ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్‌, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్‌ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడిని మరోమెట్టు పైకెక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read:

Malli Modalaindi Trailer: విడాకుల తర్వాత ‘మళ్ళీ మొదలైంది’ అంటున్న సుమంత్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Sreeleela: అందాల చందమామ శ్రీలీల గ్లామరస్ ఫోటో గ్యాలరీ

Amala Paul: 14 లక్షలు దాటిన ఫాలోవర్స్ సంఖ్య … ఫాన్స్‌ను ఫోటోస్‌తో సర్‌ప్రైజ్ చేసిన అమలా పాల్

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..