Malli Modalaindi Trailer: విడాకుల తర్వాత ‘మళ్ళీ మొదలైంది’ అంటున్న సుమంత్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

అక్కినేని హీరో సుమంత్ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. హిట్లు ఫ్లాప్‌‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

Malli Modalaindi Trailer: విడాకుల తర్వాత 'మళ్ళీ మొదలైంది' అంటున్న సుమంత్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Sumanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2021 | 3:18 PM


Malli Modalaindi: అక్కినేని హీరో సుమంత్ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. హిట్లు ఫ్లాప్‌‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో.. మొన్నామధ్య మళ్ళీరావా సినిమాతో మంచి హిట్ అందుకున్న సుమంత్.. ఇప్పుడు మళ్ళీ మొదలైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో ముఖ్య పాత్రలో యాంకర్ వర్షిణి నటించింది. ఈ సినిమా విడాకుల తర్వాత ఓ మగాడి జీవితం ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

మళ్ళీ మొదలైంది సినిమా ట్రైలర్‌ను సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ముందుగా టామ్ క్రూయిజ్-నికోల్ కిడ్.. మ్యాన్ బిల్ గేట్స్-మిలిందా గేట్స్.. బ్రాడ్ ఫైట్-ఏంజిలినా జోలీ జంటలను  చూపిస్తూ కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయి అని చూపించారు.. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితంలో జరిగిన పరిణామాలు, సానుభూతులు, తిరిగి మరో అమ్మాయిని ప్రేమించడం ఇవన్నీ ట్రైలర్‌లో చూపించారు. మొదటి భార్య అయిన వర్షిణితో విడాకులు తీసుకున్న సుమంత్.. ఆ కేసులో తన భార్య తరపున వాధించిన లాయర్ నైనా గగోలిని చూసి ప్రేమలో పడటం. ఆమెను ప్రేమలో దింపడానికి ప్రయత్నించడం ట్రైలర్‌లో చూపించారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్నఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amala Paul: 14 లక్షలు దాటిన ఫాలోవర్స్ సంఖ్య … ఫాన్స్‌ను ఫోటోస్‌తో సర్‌ప్రైజ్ చేసిన అమలా పాల్

Shruti Haasan: బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న శృతి హాసన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Ritu Varma: రియల్ లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు?.. క్లారిటీ ఇచ్చిన ‘వరుడు కావలెను’ హీరోయిన్ రీతూ వర్మ