Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మరో రచ్చ.. వార్‌కు దిగిన సన్నీ, శ్రీరామ్, జెస్సీ, మానస్.. అసలు ఏమైందంటే..

బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటోంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మరో రచ్చ.. వార్‌కు దిగిన సన్నీ, శ్రీరామ్, జెస్సీ, మానస్.. అసలు ఏమైందంటే..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2021 | 4:07 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటోంది. అయితే ఈసారి కంటెస్టెంట్స్ మధ్య వార్ కాస్త గట్టిగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. చిత్ర విచిత్రమైన టాస్క్‌లతో హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే రకరకాల గొడవలతో రచ్చ రచ్చగా ఉన్న బిగ్ బాస్ హౌస్ తాజాగా మరోసారి హీటెక్కింది. ఈసారి శ్రీ రామ్‌కు సన్నీకి, మానస్‌కు జేసీకి మధ్య వార్ నడిచింది. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా వెంటాడు వేటాడు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఈ పోటీలో థర్మోకోల్ బాల్స్‌తో నిండిన బస్తాలను ఇచ్చి.. పోటీదారులు ఇతరుల బస్తాలోని బాల్స్‌ను ఖాళీ చేయాలని టాస్క్ ఇచ్చాడు. దాంతో ఒకరి పై మరొకరు పడుతు బస్తాల్లోని బాల్స్‌ను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. దీనిలో ముందుగా సన్నీ- శ్రీరామ్ పోటీపడగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్న అని శ్రీరామ్ అనడంతో.. బిగ్ బాస్ 5 అయిపోలేదు సన్నీ ఇంకా హౌస్‌లోనే ఉన్నాడు అంటూ రచ్చ చేశాడు సన్నీ. ఆ తర్వాత శ్రీరామ్ – మానస్ పోటీ పడ్డారు. ఇందులో ఇద్దరూ అవుట్ అంటూ జెస్సీ అనడంతో జెస్సీ పై మానస్, సన్నీ సీరియస్ అయ్యారు. చివరిలో సన్నీ బస్తాను కాలితో తన్నడంతో జెస్సీ సీరియస్ అయ్యాడు. కాలితో తన్నుతున్నావేంటీ నువేమైనా పోటుగాడివా అంటూ ఫైర్ అయ్యాడు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ఉండబోతుందని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ రోజు ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amala Paul: 14 లక్షలు దాటిన ఫాలోవర్స్ సంఖ్య … ఫాన్స్‌ను ఫోటోస్‌తో సర్‌ప్రైజ్ చేసిన అమలా పాల్

Shruti Haasan: బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న శృతి హాసన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Ritu Varma: రియల్ లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు?.. క్లారిటీ ఇచ్చిన ‘వరుడు కావలెను’ హీరోయిన్ రీతూ వర్మ