AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna-CM Jagan: జగన్ నా శ్రేయోభిలాషి.. సీఎంను కలిసిన నాగార్జున..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీనటుడు నాగార్జున సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో..

Nagarjuna-CM Jagan: జగన్ నా శ్రేయోభిలాషి.. సీఎంను కలిసిన నాగార్జున..
Nagarjuna Meets Jagan
Sanjay Kasula
|

Updated on: Oct 28, 2021 | 4:37 PM

Share

Nagarjuna-CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీనటుడు నాగార్జున సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ హీరో అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్‌ను కలిసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. ” విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది. జగన్ నా శ్రేయోభిలాషి. జగన్‌ను చూసి చాలా రోజులవుతుంది. అందుకే విజయవాడకు వచ్చాను. జగన్‌తో కలిసి లంచ్ చేశాను.”

ఈ ఉదయం హైదరాబాద్ నుంచి  నాగార్జునతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి విజయవాడకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి నాగార్జున చేరుకున్నారు. నేరుగా ఇక్కడి నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు.

అయితే ఈరోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో సినీ టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకనే హీరో నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ నుంచి ఏ సినీ పెద్దలు .. సినీ నటీనటులు లేరు.. కేవలం ఇద్దరు నిర్మాతలతో వెళ్లినందున ఇప్పుడు సీఎం జగన్ తో సమావేశం టాలివుడ్ సమస్యలపైనా లేక వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు.. 

GHMC Transfer Twist: ఎల్‌బి నగర్‌ వెళ్లేందుకు విముఖత.. మళ్లీ కూకట్ పల్లిలోనే.. బదిలీలపై మళ్లీ కొత్త జీఓ..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...