Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketika Sharma: ఆ హీరోయిన్ అంటే తనకు చాలా ఇష్టమంటున్న ‘రొమాంటిక్’ బ్యూటీ.. ఆమె ఎవరంటే..

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

Ketika Sharma: ఆ హీరోయిన్ అంటే తనకు చాలా ఇష్టమంటున్న 'రొమాంటిక్' బ్యూటీ.. ఆమె ఎవరంటే..
Kethika
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2021 | 6:27 PM

Romantic: యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాకు అనిల్ పాదురి ద‌ర్శ‌కుడు. సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేతిక మాట్లాడుతూ.. “నేను డిల్లీ నుండి వ‌చ్చాను. మాది డాక్ట‌ర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక‌ కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను అన్నారు. నాకు ఈ రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్ రావాలని అనుకున్నాను. ఇలా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇన్ స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. వారు నన్ను సెలక్ట్ చేశారు.. అలా ఈ సినిమాతో నా జర్నీ మొదలైంది అని చెప్పుకొచ్చింది కేతిక. ‘ఈ సినిమాలో ఇప్పుడు ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అంటూ తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది కేతిక.

నా మొదటి చిత్రమే ఇంత పూరి క‌నెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. అన్నారు కేతిక.  నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది అన్నారు. అలాగే బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే అంటూ చెప్పుకొచ్చింది కేతిక.

Sai Pallavi

Sai Pallavi

మరిన్ని ఇక్కడ చదవండి : 

Peddanna: రజినీ మేనియానా మజాకా.. దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్ .

Aryan Khan Drugs Case: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు మంజూరు