Sudheer Babu-Sridevi Soda Center: ఓటీటీలో శ్రీదేవి సోడా సెంటర్.. తేదీ ఖరారు పై నిర్మాతల మాట.. (వీడియో)
కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. థియేటర్లలో రిలీజై అందర్నీ ఆకట్టుకున్న ఈ చిత్రం తొందర్లో ఓటీటీలో స్మ్రీమ్ కాబోతోంది.
ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో దివాళీ కానుకగా నవంబరు 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజగా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది ‘జీ 5’. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు తన నాచురల్ పర్ఫార్మెన్స్‌తో తెలుగె ప్రేక్షకుల మనసు కొళ్లగొట్టారు. సుధీర్ బాబు జంటగా హీరోయిన్ ఆనంది కూడా చక్కని హావభావాలను పండించింది. ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు డైరెక్టర్ కరుణ కుమార్. మరి ఈ సినిమా ఓటీటీ వేదికపై ఏ రేంజ్లో ఆకట్టుకుంటోందో చూడాలి.!
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
Latest Videos