AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ooru Peru Bhairavakona Movie Review: సందీప్‌ కిషన్ హిట్ కొట్టాడా? ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఎలా ఉందంటే?

కెరీర్‌లో ఒకట్రెండు విజయాలు తప్ప ఇప్పటి వరకు సరైన బ్లాక్‌బస్టర్ రుచి తెలియని హీరో సందీప్ కిషన్. ఎంతకష్టపడినా ఇప్పటి వరకు ఈయన కోరుకున్న విజయం అయితే రాలేదు. తాజాగా ఈయన తనకు అచ్చొచ్చిన దర్శకుడు విఐ ఆనంద్‌తో ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

Ooru Peru Bhairavakona Movie Review: సందీప్‌ కిషన్ హిట్ కొట్టాడా?  'ఊరు పేరు భైరవకోన' సినిమా ఎలా ఉందంటే?
Ooru Peru Bhairavakona Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Basha Shek|

Updated on: Feb 16, 2024 | 3:03 PM

Share

మూవీ రివ్యూ: ఊరు పేరు భైరవకోన నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవిశంకర్, వైవా హర్ష, వడి వక్కరసి తదితరులు సినిమాటోగ్రఫర్: రాజ్ తోట సంగీతం: శేఖర్ చంద్ర నిర్మాత: రాజేష్ దండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: విఐ ఆనంద్

కెరీర్‌లో ఒకట్రెండు విజయాలు తప్ప ఇప్పటి వరకు సరైన బ్లాక్‌బస్టర్ రుచి తెలియని హీరో సందీప్ కిషన్. ఎంతకష్టపడినా ఇప్పటి వరకు ఈయన కోరుకున్న విజయం అయితే రాలేదు. తాజాగా ఈయన తనకు అచ్చొచ్చిన దర్శకుడు విఐ ఆనంద్‌తో ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ:

ఇవి కూడా చదవండి

అనగనగా ఓ ఊరు.. ఆ ఊరు పేరు భైరవకోన. అందులోకి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో బయటికి రావడం అనేది జరగదు. అయితే ఓ దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బసవలింగం (సందీప్ కిషన్), జాన్ (వైవా హర్ష) అనుకోకుండా ఆ ఊళ్లోకి వెళ్తారు. వాళ్లతో పాటు అగ్రహారం గీత (కావ్య థాపర్) కూడా ఆ ఊరిలోకి వెళ్తుంది. స్వతహాగా స్టంట్ మ్యాన్ అయిన బసవ.. తను ప్రేమించిన భూమి కోసం పెద్ద దొంగతనం చేస్తాడు. అక్కడ్నుంచి తప్పించుకునే క్రమంలోనే భైరవకోనలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుపోతాడు. అక్కడికి వెళ్లాక బసవ అండ్ టీంకు ఎదురైన కష్టాలేంటి..? పెద్దమ్మ (వడివుక్కరసి), రాజప్ప (రవి శంకర్), డాక్టర్ నారప్ప (వెన్నెల కిశోర్) వీళ్లంతా కలిసి బసవను ఏం చేస్తారు అనేది అసలు కథ..

కథనం:

కొన్ని సినిమాలకు కేవలం దర్శకుల కారణంగానే క్రేజ్ వస్తుంది. ఊరు పేరు భైరవకోన విషయంలోనూ ఇదే జరిగింది. సినిమాల పరంగా ఆయన ఫెయిల్ అయ్యుండొచ్చు గానీ.. విఐ ఆనంద్ చేసిన సినిమాల్లో ఐడియాస్ అదిరిపోతాయి. వర్కవుట్ అయితేఎక్కడికి పోతావు చిన్నవాడా.. లేదంటే డిస్కో రాజా. ఊరు పేరు భైరవకోన కూడా అంతే.. ఐడియా అదిరిపోయింది. ఫస్టాఫ్ వరకు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్.. అక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. ఫస్ట్ సీన్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్‌గానే రాసుకున్నాడు ఆనంద్. ఎలాగూ ఫాంటసీ అన్నాడు కాబట్టి లాజిక్స్‌కు అందని సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నాడు.. ఇక హీరో అండ్ గ్యాంగ్ భైరవకోనలోకి ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా అలరిస్తాయి. కాసేపు లాజిక్స్ పక్కనబెడితే ఊరు పేరు భైరవకోన బాగానే అలరిస్తుంది. ఓ చిన్న పాయింట్ చుట్టూ కథను అల్లుకున్నాడు. అక్కడక్కడా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫ్లేవర్ ఉన్నా.. తన మార్క్ మిస్ చేయలేదు ఆనంద్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ రేంజ్‌లో ఇచ్చాక.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది. కానీ కీలకమైన సెకండాఫ్‌లోనే ఎమోషన్ మిస్ అయిపోయింది. దెయ్యాలతో కామెడీ చేయించడం.. అక్కడ వచ్చే కొన్ని సీన్స్ అంతగా ఆకట్టుకోవు. మెయిన్ థీమ్ చాలా సినిమాల్లో చూసిందే.. కానీ దాన్ని డీల్ చేసిన విధానం కొత్తగా ఉంది.. ఫాంటసీ అంశాలను తెర మీద బాగానే చూపించాడు.. అయితే ట్రైలర్ చూసినపుడు కలిగే వావ్ ఫీలింగ్ సినిమా చూస్తున్నపుడు మాత్రం రాదు. భైరవకోనకు సంబంధించిన ట్విస్ట్ బయటపడే సీన్ బాగుంది.. అలాగే ముందు చెప్పుకున్నట్లు ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలైట్. అక్కడే సినిమా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఆ తర్వాత వచ్చే గరుడ పురాణం.. మిస్సయిన నాలుగు పేజీలు అంటూ చాలా పెద్ద కాన్సెప్ట్ చూపించినా అది వైవా హర్ష సినిమాలో చెప్పిన డైలాగ్‌లా కొంచెం తెలుగులో చెప్పవా అన్నట్లుగానే ఉంటుంది.

నటీనటులు:

సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు.. చక్కగా ఆ పాత్రలో సరిపోయాడు. వర్ష బొల్లమ్మ, కావ్య తపర్ ఉన్నంతలో తమ కారెక్టర్స్‌కు న్యాయం చేసారు. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ పర్లేదు. రవిశంకర్ మరో కీలక పాత్రలో బాగున్నాడు. ఇక సీనియర్ నటి వడి వక్కరసి ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

‘ఊరు పేరు భైరవకోన’కు మెయిన్ బలం టెక్నికల్ టీం. ఈ సినిమా బాగా రావడానికి కారణం వాళ్లే. ముఖ్యంగా శేఖర్ చంద్ర మంచి పాటలిచ్చాడు. నిజమే నే చెబుతున్నా.., హమ్మ హమ్మ పాటలు చూడ్డానికి కూడా బాగున్నాయి. రాజ్ తోట సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమాకు పెట్టిన బడ్జెట్ తెరపై కనిపించింది. ఎడిటింగ్ ఓకే.. దర్శకుడు వీఐ ఆనంద్ స్క్రిప్టు విషయంలో కష్టపడ్డాడు కానీ స్క్రీన్ మీద అది అంతగా రిఫ్లెక్ట్ కాలేదు. ఇంటర్వెల్ వరకు స్పీడ్‌గా తీసుకెళ్లినా.. కీలకమైన సెకండాఫ్ విషయంలో ఎమోషన్ మిస్ అయిపోయింది. మరోసారి ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడు కానీ సగమే సక్సెస్ అయ్యాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఊరు పేరు భైరవకోన.. ఫస్టాఫ్ థ్రిల్.. సెకండాఫ్ డల్..