Chiranjeevi:’ మేం చిరంజీవి అభిమానులం… ఆయన ఫొటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశాం’.. సుందరం మాస్టర్ టీమ్
ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సుందరం మాస్టర్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సుందరం మాస్టర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్

ప్రముఖ కమెడియన్ వైవా హర్ష అలియాస్ హర్ష చెముడు హీరోగా నటించిన చిత్రం సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించిన ఈ సినిమాలో దివ్య శ్రీ పాద హీరోయిన్‌గా నటించింది. ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సుందరం మాస్టర్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సుందరం మాస్టర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘సుందరం మాస్టర్ ట్రైలర్ చాలా బాగుంది. వైవా హర్ష కోసమే ఈ క్యారెక్టర్ పుట్టినట్ గా ఉంది. తనకు తాను, తన టట్యాలెంట్‌ను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఇఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు’ అని హర్షను కొనియాడారు చిరంజీవి. ఇదే సందర్భంగా మాట్లాడిన సుందరం మాస్టర్ టీమ్ చిరంజీవిపై తమ ప్రేమాభిమానాలను చాటుకుంది. తమ లాంటి కొత్త వాళ్లను, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవికి ప్రత్యేక ధనవ్యాదాలు తెలిపింది సుందరం మాస్టర్ టీమ్.
సుందరం మాస్టర్ నిర్మాత సుధీర్ కుమార్ మాట్లాడుతూ’ మాస్ మహరాజా రవితేజతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆయన సాయం, సహకారం ఎప్పటికీ మరువలేను. ఆల్రెడీ నేను ఈ సినిమాను చూశాను. చాలా బాగా వచ్చింది. మేం అంతా మెగాస్టార్ చిరంజీవి అభిమానులం. ఆయన ఫొటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆయనే మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
సుందరం మాస్టర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..
Here’s a glimpse into #SundaramMaster Trailer Launch Event’s highlights 🤩✨
Watch Trailer here ▶️ https://t.co/MmWzwD2udn
Greynd releaz varold vyde on 𝐅𝐄𝐁 𝟐𝟑𝐫𝐝! @RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini… pic.twitter.com/DEQlZCZV7o
— RT Team Works (@RTTeamWorks) February 15, 2024
నిర్మాత కామెంట్స్.. వీడియో
Producer @SudheerKurru Speech at #SundaramMaster 👨🏫 Trailer Launch Event✨
Watch Trailer here ▶️ https://t.co/MmWzwD2udn@RaviTeja_offl @harshachemudu #DivyaSripada @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA @MediaYouwe… pic.twitter.com/ZSLhJ7FMss
— RT Team Works (@RTTeamWorks) February 15, 2024
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








