Pushpa 2: సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్.. రేవతి కుటుంబానికి భరోసా

పుష్ప 2  ప్రీమియర్స్ లో  అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 04న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో సినిమా చూడడానికి వచ్చిన రేవతి ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. 

Pushpa 2: సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్.. రేవతి కుటుంబానికి భరోసా
Sukumar
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2024 | 7:56 PM

అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన పుష్ప2 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. అల్లు అర్జున్ అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో ఏకంగా రూ. 449 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో చిత్ర బృందమంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా శనివారం (డిసెంబర్ 07) చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్ సంధ్య థియేటర్ ఘటన తల్చుకుని ఎమోషనల్ అయ్యారు. ‘నేను మూడు రోజుల నుంచి సంతోషంగా లేను. నేను మూడేళ్లు, ఆరేళ్లు సినిమా తీసినా ఒక ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ బాధ నుంచి కాస్త తేరుకున్నాకే సినిమా రికార్డులు చూస్తున్నాం. ఆ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు సుకుమార్.

‘పుష్ప 2 Directed by సుకుమార్ మాత్రమే కాదు.. శ్రీమాన్ అని వేయాలి.. ఈ సినిమాలో సగం ఆయనే డైరెక్ట్ చేశాడు.. సెకండ్ యూనిట్ మొత్తం శ్రీమాన్ చూసుకున్నాడు. సుకుమార్ అనేవాడు ఒక్కడు కాదు.. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిస్తేనే సుకుమార్ అవుతాడు’ తన టీమ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు సుకుమార్. కాగా పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా బుధవారం (డిసెంబర్ 04 హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ కన్నుమూయగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.