AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే.. బ్రేకప్ చెప్పేసిన జంటలు..

2024 ఈ ఏడాది ఎంతో మంది సెలబ్రెటీల జీవితాల్లో తుఫాన్ చెలరేగింది. సినీ కెరీర్ పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు తీసుకున్నారు. మెరిసే సినీరంగుల ప్రపంచంలో కొందరి నటీనటుల వైవాహిక బంధాలు ముగిసిపోయాయి.

Tollywood: 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే.. బ్రేకప్ చెప్పేసిన జంటలు..
Celebrities
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2024 | 7:44 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ ఫేవరెట్ సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తుంటారు. కానీ 2024లో ఎంతోమంది వైవాహిక బంధాలు ముగిసిపోయాయి. సినీతారల పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట నిత్యం ఏదోక విషయం చక్కర్లు కొడుతుంది. సినీ అప్డేట్స్ కంటే ఎక్కువగా తారల వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీస్తుంటారు. కానీ ఇటీవల కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో డివోర్స్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. 2024లో ఏ సెలబ్రిటీలు విడిపోయారు ? ఎవరెవరు విడాకులు తీసుకున్నారో తెలుసుకుందామా.

ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ ఇప్పుడు విడిపోయారని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఐశ్వర్య, ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వారు 18 ఏళ్ల తర్వాత విడిపోయారు.

ఎ.ఆర్. రెహ్మాన్, సైరా బాను: 29 సంవత్సరాల వివాహం తర్వాత, ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎ. ఆర్. రెహ్మాన్ తన భార్య నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఎ.ఆర్. రెహ్మాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 2024లో తమ విడాకులు ప్రకటించారు. విడాకుల తర్వాత, షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్: 2024 సంవత్సరం ప్రారంభం నుండి, హార్దిక్ మరియు నటాషాల విడాకుల చర్చలు ఊపందుకున్నాయి. పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో హాట్ హాట్ చర్చల తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈషా డియోల్, భరత్ తఖ్తానీ: హేమ మాలిని కుమార్తె ఈషా డియోల్, భరత్ తఖ్తానీ కూడా ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

మలైకా అరోరా, అర్జున్ కపూర్: 2019లో అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us