Raptadu Victim: రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన మంత్రి లోకేష్
రాప్తాడు దాడి ఘటనలో కీలక అప్‌డేట్ వచ్చింది. నిందితుడి హేమంత్ దాడిలో గాయపడిన చిన్నారి హెల్త్ బులెటిన్ విడుదలైంది. అనుకున్నదానికంటే వేగంగా ఆ చిన్నారి కోలుకుంటోంది. చిన్నారి ధైర్యం, డాక్టర్ల వైద్యం.. ఫలిస్తోందని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు. అతి త్వరలోనే ఆ చిన్నారి ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుందని కూడా అంటున్నారు మంత్రి లోకేష్.

అనంతపురం జిల్లాలో రాప్తాడు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలిక స్పీడ్‌గా కోలుకుంటోంది. హేమంత్ దాడిలో గాయపడిన రాప్తాడు పదవ తరగతి చిన్నారి చాలా వేగంగా కోలుకుంటోందన్నారు మంత్రి నారా లోకేష్. ఆ చిన్నారి అద్భుతమైన పోరాట పటిమను కనబరుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వెంటిలేటర్ సాయం లేకుండానే ఆ చిన్నారి గాలి పీల్చగలుగుతోంది. ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయి. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటోంది. ఇతరుల సాయంతో నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేస్తోంది. ఆ చిన్నారి త్వరగా కోలుకునే క్రమంలో ఇదో అద్భుతమైన మైలురాయి అంటూ లోకేష్ పోస్ట్ పెట్టారు.
నిపుణులైన వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆమె ఎంతో ధైర్యంతో క్రమంగా కోలుకుంటున్న తీరు సంతోషాన్నిస్తోంది. అవిశ్రాంతంగా సేవలందిస్తోన్న వైద్య సిబ్బందితో పాటు ఆమెకు అండగా నిలుస్తూ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు మంత్రి లోకేష్.
మంత్రిలోకేష్ పోస్ట్..
Update (4 PM, 15th November 2026)
Our brave little warrior has shown remarkable resilience following her recent procedures. Her vitals are completely stable, and she is maintaining healthy oxygen saturation levels naturally on room air. She has also begun taking food orally well and is taking slow, steady steps with support – a wonderful milestone in her healing process.
The dedicated team of doctors and specialists continues to monitor her round the clock. While she is undergoing ongoing physiotherapy and rehabilitation, they are also ensuring her comfort with appropriate care for minor post-procedure symptoms, including a gentle dry cough and tooth sensitivity.
Seeing her strength and steady progress is truly reassuring for all of us. My sincere gratitude to the tireless medical staff caring for her and to everyone keeping her in their thoughts and prayers.
— Lokesh Nara (@naralokesh) November 15, 2026
ఇన్ఫెక్షన్, వాపులు తగ్గాయని వైద్యులు స్పష్టం చేశారు. సాధారణ ఇన్ఫెక్షన్ కంటే ప్రస్తుతం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ 75 శాతం రికవరీ అయినట్లు వైద్యులు తెలిపారు. దాడి కారణంగా బాలిక రక్తం తీవ్రంగా పోయింది. ప్రస్తుతం రక్తం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. వైద్యుల సహాయంతో నెమ్మదిగా నడుస్తున్న బాధితురాలికి.. నొప్పి, ఆందోళన తగ్గించేందుకు మందులు ఇస్తున్నారు వైద్యులు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తుండటం వల్ల భుజం కదుపుతోందని వైద్యులు స్పష్టంచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
