AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Curry: పక్కా కొలతలతో నెల్లూరు స్టైల్ చేపల కూర.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!

నాన్‌వెజ్ ప్రియులలో చేపలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మీరు నార్మల్‌గా రెగ్యుల్ చేపల కర్రీ కాకుండా ఆంధ్ర స్పెషల్ అయిన నెల్లూరు స్టైల్ చేపల కర్రీని తినాలి అనుకుంటే.. ఈ సారి ఇంట్లోనే చేసుకునేందుకు ట్రై చేయండి. ఈ కర్రీని ఇంట్లోనే పక్కా కొలతలతో ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.

Fish Curry: పక్కా కొలతలతో నెల్లూరు స్టైల్ చేపల కూర.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!
Mastering Nellore Fish Curry
Anand T
|

Updated on: Nov 15, 2026 | 9:41 PM

Share

ఆంధ్ర వంటకాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న అద్భుతమైన వంటకం ఏదైనా ఉందంటే అది నెల్లూరు చేపల పులుసు. పులుపు, కారం, ఉప్పుల కచ్చితమైన సమతుల్యతతో కూడిన ఈ వంటకం పేరు చెబితేనే భోజన ప్రియులకు నోరూరుతుంది. మరీ ఈ నెల్లూరు స్టైల్‌లో మన ఇంట్లో చేపల కూర చేసుకుంటే ఎలా ఉంటుంది. పక్కా కొలతలతో నెల్లూరు స్టైల్ చేపల కూర ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • చేప ముక్కలు: 800–900 గ్రాములు
  • చింతపండు: 40 గ్రాములు
  • పచ్చి మామిడికాయ ముక్కలు: అర కప్పు
  • ఉల్లిపాయలు: 2 మధ్యస్థ
  • టమాటా: 1 సన్నగా తరిగినది
  • పచ్చిమిర్చి: 2 మధ్యకు చీల్చినవి
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • నూనె: 3–4 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు: 1 టీ స్పూన్
  • పసుపు: అర టీ స్పూన్
  • ఉప్పు: 1 టీ స్పూన్ చేపలకు, రుచికి సరిపడా పులుసుకు
  • కారం: 1 టీ స్పూన్ చేపలకు, 2–3 టేబుల్ స్పూన్లు పులుసుకు

ప్రత్యేక మసాలా పొడి కోసం:

  • ధనియాలు: 1 టీ స్పూన్
  • జీలకర్ర: అర టీ స్పూన్
  • ఆవాలు: అర టీ స్పూన్
  • మెంతులు: అర టీ స్పూన్

తయారీ విధానం:

స్టెప్-1: ముందుగా చేప ముక్కలను ఉప్పు, నిమ్మరసం ఉపయోగించి జిగురు పూర్తిగా పోయేంతవరకు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసి ముక్కలకు బాగా పట్టించి పక్కన ఉంచాలి. ఇప్పుడు 40 గ్రాముల చింతపండును ఒక కప్పు వేడి నీటిలో నానబెట్టాలి. వేడి నీటి వల్ల చింతపండు త్వరగా నాని పులుసు చిక్కగా వస్తుంది. మరోవైపు స్టవ్ మీద పాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులను దోరగా వేయించి, మిక్సీలో మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టెప్-2: చేప ముక్కలు విరగకుండా సమంగా ఉడకడానికి వెడల్పుగా, మందంగా ఉండే పాన్ లేదా కడాయిని తీసుకోవాలి. అందులో 3–4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

స్టెప్-3: తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించాక, సన్నగా తరిగిన లేదా బ్లెండ్ చేసిన టమాటా వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంతవరకు మగ్గించాలి. ఇప్పుడు 2–3 టేబుల్ స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది. నానబెట్టుకున్న చింతపండు నుండి తీసిన పులుసును పాన్‌లో పోయాలి. పులుసు చిక్కదనాన్ని బట్టి 800 ml నుండి 1 లీటరు వరకు నీటిని కలుపుకోవచ్చు. ఉప్పు సరిచూసి, మూత పెట్టి ఒక పొంగు వచ్చేవరకు మరిగించాలి.

స్టెప్-4: పులుసు మరుగుతున్నప్పుడు మారినేట్ చేసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా సమానంగా పరచాలి. వెంటనే గరిటెతో ఒకసారి తిప్పాలి. ఆ తర్వాత గరిటెను అస్సలు ఉపయోగించకూడదు, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. మంటను సిమ్‌లో పెట్టి, మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో గిన్నెను వస్త్రంతో పట్టుకుని నెమ్మదిగా కుదుపుతూ ఉండాలి.

స్టెప్-5: చేప ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత అర కప్పు పెద్ద పచ్చి మామిడికాయ ముక్కలను వేసి, గిన్నెను కుదుపుతూ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. అనంతరం సిద్ధం చేసుకున్న మసాలా పొడి మొత్తాన్ని వేసి, గిన్నెను కుదుపుతూ పులుసులో కలిసేలా చేయాలి. మంటను లో-ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు మసాలా పచ్చివాసన పోయి సువాసన వచ్చేంతవరకు ఉడికించాలి.

స్టెప్-6: పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసులో కొత్తిమీర వాడరు కావాలనుకుంటే మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు. స్టవ్ ఆపి పులుసును పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చేపల పులుసు వండిన వెంటనే కంటే, పూర్తిగా చల్లారిన తర్వాత మరుసటి రోజుకు మరింత అద్భుతమైన రుచి వస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us