AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్ ఎఫ్‌డీ.. ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?

పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్ ఎఫ్‌డీలు. ఈ రెండిటిల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిదనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొంమతంది పోస్టాఫీస్ పథకాల్లో అధిక ఆదాయం వస్తుందని చెబుతుంటే.. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై కూడా అధిక వడ్డీని అందిస్తున్నట్లు మరికొంతమంది అంటున్నారు. నిపుణులు అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే..

పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్ ఎఫ్‌డీ.. ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
India Money
Venkatrao Lella
|

Updated on: Nov 15, 2026 | 10:03 PM

Share

డబ్బులు పొదుపు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో సురక్షిత మార్గాలు పోస్టాఫీస్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉంటాయి. ఇవి స్థిరమైన ఎలాంటి రిస్క్ లేని ఆదాయాన్ని అందిస్తాయి. వీటిని సాంప్రదాయ పెట్టుబడి సాధనాలుగా చెబుతుంటారు. అయితే ఈ ఆప్షన్లలో ఏది మంచిదనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటను పెంచడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వ యథాతధంగా ఉంచింది. ఈ రెండింటిల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిదనేది చూద్దాం.

అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుత బ్యాంకు FD డిపాజిట్ల వడ్డీ రేట్లను పోస్టాఫీస్ పథకాలతో పోల్చి చూడండి. దీంతో ఎందులో ఎక్కువ పెట్టుబడి వస్తుందనేది అంచనా వేసుకుకని తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి వంటి పథకాల వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేటు 7.5 శాతం, కిసాన్ వికాస్ పత్ర (KVP) 7.5 శాతం ఉంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) 7.4 శాతం వడ్డీ అందిస్తుండగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) 7.1 శాతం రాబడిని అందిస్తోంది

అయితే పోస్టాఫీస్ పథకాలతో పోల్చుకుంటే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని అందిస్తుండగా.. ఉజ్జీవన్ మరియు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8.1 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ రేట్ల కంటే ఎక్కువ వడ్డీకి అందిస్తున్నప్పటికీ.. వాటి గరిష్ట రాబడులు తరచుగా నిర్దిష్ట కాలపరిమితులకు మాత్రమే వర్తిస్తాయి. పెట్టుబడిదారులు తమ నిధులను బ్యాంక్ ఎఫ్‌డీలలో గానీ లేదా ప్రభుత్వ మద్దతు గల పోస్టాఫీస్ పథకాలలో పెట్టే ముందు వడ్డీ రేట్లు, కాలపరిమితిని,ఇతర నియమాలను పరిశీలించుకోండి. అలాగే అర్హత నియమాలు, చెల్లింపుల కాలం వంటి వివరాలను తనిఖీ చేసుకోండి.

Follow Us