Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజు.. స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. పోస్టర్ అదిరిపోయింది..
ఎట్టకేలకు మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కానీ మొదటి సారి ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ అదిరిపోయింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పిటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. ఈ సందర్బంగా మహేష్ పోస్టర్ రివీల్ చేస్తూ.. ఈసినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 2025లో షేర్ చేయనున్నట్లు తెలిపారు. జక్కన్న షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ ధరించి కనిపిస్తున్నారు.
ఈ లాకెట్ తోపాటు మెడపై నుంచి రక్తం కారుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పోస్టర్ మొత్తం రివీల్ చేయకపోయినా కేవలం ఛాతీ పిక్ చూపించిన సరే బెస్ట్ ట్రీట్ అంటున్నారు.
రాజమౌళి ట్వీట్..
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
అలాగే మరో పోస్టులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రేమికులతోపాటు మహేష్ అభిమానులకు తెలియజేస్తూ.. “మేము కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించాము. సినిమా గురించి తెలుసుకోవాలని మీ తనప నేను అర్థం చేసుకోగలను. సినిమా స్టోరీ కానీ స్కోప్ కానీ చాలా పెద్దదని.. అందుకో కొన్ని ఫోటోస్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లు కానీ.. దానికి న్యాయం చేయలేదని భావిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మీకు సినిమాను ఎంత అద్భుతంగా చూపించాలనే విషయం మీద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని.. అలాగే ఫస్ట్ రివీల్ కూడా అంతే అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ 2025 వరకు మీరు ఆగక తప్పదు. ఇప్పటివరకు ఎన్నడూ చూడనటువంటి సినిమాను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే కాస్త ఓపిక పట్టాల్సిందే” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?








