Tollywood: స్టార్ హీరోయిన్ సింప్లిసిటీ.. రోడ్ సైడ్ షాప్‌లో టీ తాగి సెల్ఫీలు దిగిన అందాల తార.. వీడియో చూడండి

సాధారణంగా సినిమా సెలబ్రిటలంటే లగ్జరీ లైఫ్ అనుకుంటారు. ఎక్కడికి పోయినా ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనే స్టే చేస్తారు. ఇక ఫేమస్ రెస్టారెంట్స్ లోనే ఫుడ్ తింటుంటారు. అయితే తెలుగు నాట సెన్సేషన్ అయిన ఓ హీరోయిన్ ఎంత ఒదిగినా భూమి మీద న‌డ‌వాల‌ంటోంది. సాధారణ యువతిలా అందరిలో కలిసిపోతూ తన సింప్లిసిటీని చాటుకుంది.

Tollywood: స్టార్ హీరోయిన్ సింప్లిసిటీ.. రోడ్ సైడ్ షాప్‌లో టీ తాగి సెల్ఫీలు దిగిన అందాల తార.. వీడియో చూడండి
Actress Sreeleela
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2024 | 4:02 PM

ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరు. కేవలం అందం, అభినయం పరంగానే కాకుండా డ్యాన్సుల‌తో దుమ్మురేపుతోందీ అందాల తార. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించిన శ్రీలీల.. ఈ ఏడాది మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక అరడజనుకు పైగా సినిమాలున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, నితిన్ రాబిన్ హుడ్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఒక బాలీవుడ్ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. శ్రీలీల కు సామాజిక దృక్పథం ఎక్కువ. పేద పిల్లలు, అనాథ‌ల‌కు, ఫిజిక‌ల్, మెంట‌ల్లీ డిజుబుల్ ప‌ర్స‌న్స్‌కు తనకు వీలైనంత వరకు సాయం చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకుంది శ్రీలీల. స్టార్ హీరోయిన్ అయినా ఒక సాధారణ అమ్మయిలా రోడ్ సైడ్ టీ స్టాల్ లో టీ తాగింది. అంతేకాదు ఆ టీ షాప్ నిర్వహిస్తోన్న మహిళ, చుట్టు పక్కల ఉన్న వారితో అప్యాయంగా మాట్లాడింది. వారితో సరదగా ఫొటోలు కూడా దిగింది.

తాజాగా ఓ సినిమా షూటింగ్ కోసం అరకు వెళ్లింది శ్రీలీల. అయితే షూటింగ్ లో కాస్త విరామం దొరకడంతో మధ్యలో తన తల్లితో కలిసి రోడ్ సైడ్ ఉన్న ఒక చిన్న టీ స్టాల్ కు వెళ్లి సందడి చేసింది. శ్రీలీలను గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. హీరోయిన్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. శ్రీలీల కూడా అడిగిన వారందరికీ కాదనకుండా సెల్ఫీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి