- Telugu News Photo Gallery Cinema photos 35 Chinna Katha Kadhu movie to Satyadev Zebra latest cinema updates from tollywood
Film Updates: చిన్న కథకు పెద్ద ఘనత.. పక్కకు తప్పుకున్న జీబ్రా..
35 చిన్న కథ కాదు సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఏఎన్నార్ శత జయంతిని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అక్కినేని నాగార్జున. బాలీవుడ్ లెజెండరీ స్టార్ మీనాకుమారి జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ అమరన్. ఇలా తాజా సినిమా న్యూస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
Updated on: Oct 27, 2024 | 3:45 PM

35 చిన్న కథ కాదు సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. నవంబర్‌లో జరగనున్న గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. కేవలం 25 చిత్రాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం 35 చిన్న కథ కాదు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.

ఏఎన్నార్ శత జయంతిని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అక్కినేని నాగార్జున, ఈ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అబితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. ఈ వేదిక మీద చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డును బిగ్ బీ చేతుల మీదుగా అందచేయనున్నారు.

బాలీవుడ్ లెజెండరీ స్టార్ మీనాకుమారి జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. సిద్దార్థ్ పి మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో కియారా అద్వానీ నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కమల్ ఔరా మీనా పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాకుమారి జీవితంలోని లవ్ యాంగిల్‌ను మాత్రమే చూపించబోతున్నారు.

దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. రిలీజ్‌కు ముందే జరిగిన అగ్రిమెంట్ ప్రకారం అమరన్ సినిమాను డిసెంబర్ మొదటి వారంలోనే డిజిటల్‌లో రిలీజ్ చేయాల్సి ఉంది.

కన్నడ నటుడు డాలీ ధనుంజయ్, టాలీవుడ్ స్టార్ సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ జీబ్రా. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ వెల్లడిస్తామన్నారు.




