- Telugu News Photo Gallery Cinema photos Rajamouli, Mahesh Babu Movie SSMB29 to Release in Two parts Update goes viral on 26 October 2024, Telugu Heroes Photos
SSMB29: జక్కన్న, మహేష్ కాంబో నుంచి మరో అప్‌డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.!
కల్కి 2898 ఏడీ తరువాత అదే రేంజ్‌లో భారీ హైప్ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇంకా సెట్స్ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు.
Updated on: Oct 27, 2024 | 2:22 PM

దాన్ని ప్లాన్ చేయడం కూడా అలాగే చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి రానుంది. నిన్నమొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లన్నారు కానీ దాని స్థాయి అక్కడ లేదు.

ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ రిలీజ్ తరువాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపిన జక్కన్న కూడా ఇప్పుడు పూర్తిగా మహేష్ మూవీ మీదే వర్క్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రజెంట్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి.

ఎక్కువ భాగం సెట్స్‌లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేసినా... ఆ సెట్స్, వీఎఫ్ఎక్స్‌కు కావాల్సిన రిఫరెన్స్‌ల కోసం రియల్ లొకేషన్స్‌ను వెతికే పనిలో ఉన్నారు. నవంబర్ 15 లోగా లొకేషన్ల వేట పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. నవంబర్ ఎండింగ్ నుంచి లీడ్ ఆర్టిస్ట్‌లతో ఓ వర్క్‌షాప్ నిర్వహించే ఆలోచనలో ఉంది జక్కన్న టీమ్.

ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్‌లో SSMB29 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా అయిపోయింది. SSMB29 బడ్జెట్ అంతా అనుకుంటున్నట్లు 500 కోట్లు కాదని.. కనీసం 1000 కోట్లు అవుతుందని తెలుస్తుంది.

బాహుబలి సిరీస్‌తో 2400 కోట్లు.. ట్రిపుల్ ఆర్‌తో 1300 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి.. మహేష్ బాబు కోసం అంతకుమించే ఆలోచిస్తారు కానీ తగ్గరు కదా..! ఇప్పుడిదే జరగబోతుంది. SSMB29 కోసం చాలా వరకు టీం అంతా హాలీవుడ్ నుంచే రానున్నారు.





























