- Telugu News Photo Gallery Cinema photos Aha Unstoppable to Alia Bhatt Counter latest film updates from industry
Movie News: అన్‌స్టాపబుల్ సీజన్ 4 రెస్పాన్స్.. వారికి ఆలియా కౌంటర్..
అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు ఆలియా భట్. విక్రాంత్ మెస్సీ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది సబర్మతి రిపోర్ట్. ప్రశాంత్ నీల్ కథతో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ బఘీర. ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అభిషేక్ బచ్చన్. ఇలాంటి తాజా ఉపాదాట్లు ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Oct 27, 2024 | 3:06 PM

అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యింది. ముందు నుంచే షో మీద భారీ అంచనాలు ఉండటంతో రిలీజ్ అయిన కొద్ది సేపటికే రికార్డ్ వ్యూస్ సాధించింది ఈ షో. తొలి ఎపిపోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చారు.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు ఆలియా భట్. తన లుక్స్, మాటతీరు విషయంలో నెగెటివ్ కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హీరోయిన్లను ట్రోల్ చేస్తున్న వారిలో మహిళలు కూడా ఉండటం మరింత బాద కలిగిస్తుందన్నారు ఆలియా.

విక్రాంత్ మెస్సీ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది సబర్మతి రిపోర్ట్. గోద్రా అల్లర్ల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రాశీఖన్నా, రిద్ధీ డోగ్రా కీలక పాత్రల్లో నటించారు. రంజన్ చందేల్ దర్శకుడు. నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రశాంత్ నీల్ కథతో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ బఘీర. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో కన్నడ నటుడు శ్రీమురళి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అభిషేక్ బచ్చన్, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సూజిత్ సిర్కార్ దర్శకత్వంలో ఐ వాంట్ టు టాక్ అనే సినిమా చేస్తున్నారు అభి. నవంబర్ 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు.




