- Telugu News Photo Gallery Cinema photos Hero Suriya kanguva movie 2000 crore club entry comment goes viral. Details here Telugu Heroes Photos
kanguva-Suriya: పెద్ద కల కనటం తప్పా అంటున్న సూర్య.! 2000 కోట్ల క్లబ్ కామెంట్స్
ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా ముందు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వెయ్యి కోట్లు. ఆ క్లబ్‌లో చోటు కోసమే ప్రతీ స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మంచి కలలు కనడం తప్పేం లేదన్నారు. కంగువతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ కోలీవుడ్ స్టార్ హీరో.. సౌత్‌లో రేర్ రికార్డ్‌ను టార్గెట్ చేస్తున్నారు. సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ.
Updated on: Oct 27, 2024 | 1:46 PM

ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా ముందు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వెయ్యి కోట్లు. ఆ క్లబ్‌లో చోటు కోసమే ప్రతీ స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మంచి కలలు కనడం తప్పేం లేదన్నారు.

అది పక్కా ఊరమాస్ రోల్. సో, నియర్ ఫ్యూచర్‌లో పక్కా కమర్షియల్, యాక్షన్, ఊర మాస్ రోల్స్ లో మాత్రమే కనిపించాలని ఫిక్సయిపోయారు నడిప్పిన్ నాయగన్.

తమిళనాట కంగువాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకటం కష్టంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ స్లోగా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

అయితే ఈ కామెంట్స్ మీద తమిళ మీడియాలోనూ విమర్శలు వినిపించాయి. ఇప్పటి వరకు వెయ్యి కోట్లు సినిమా కూడా లేని కోలీవుడ్‌లో రెండు వేల కోట్ల కలెక్షన్స్ అయ్యే పనేనా అన్న సెటైర్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.

ఒకటి రెండు కాదు.. 38 భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో కోలీవుడ్‌కు కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని అందిస్తానంటున్నారు సూర్య. మరి ఈయన నమ్మకం నిజమవుతుందా లేదా అనేది నవంబర్ 14న తేలనుంది.

మరి కంగువ టీమ్ కల నిజమవుతుందా..? ఈ సినిమా 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవుతుందా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నవంబర్ 14న సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.




