- Telugu News Photo Gallery Cinema photos Who will break Baahubali 2 record in Indian Film Industry, Hopes on prabhas, Telugu Heroes Photos
Prabhas: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసేదెవరు.? ఇప్పటి వరకు ఆ రికార్డ్ టచ్ చేసిన హీరోనే లేడు మామ.
ఇండియన్ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసిన సినిమా బాహుబలి. అప్పటి వరకు ఉన్న బడ్జెట్ లెక్కలు, బిజినెస్ లెక్కలను ఒక్కసారిగా తారు మారు చేసింది ఈ మూవీ. కానీ ఆ తరువాత మళ్లీ అదే రేంజ్ హిట్ ఇంత వరకు పడలేదు. బాహుబలి కొట్టే హిట్ ఇవ్వటం రాజమౌళి, ప్రభాస్ వల్ల కూడా కాలేదు. మరి అప్ కమింగ్ సినిమాల్లో ఈ ఇద్దరిలో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసేదెవరు? ఆ ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది?
Updated on: Oct 27, 2024 | 1:33 PM

ఇండియన్ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసిన సినిమా బాహుబలి. అప్పటి వరకు ఉన్న బడ్జెట్ లెక్కలు, బిజినెస్ లెక్కలను ఒక్కసారిగా తారు మారు చేసింది ఈ మూవీ. కానీ ఆ తరువాత మళ్లీ అదే రేంజ్ హిట్ ఇంత వరకు పడలేదు.

బాహుబలి కొట్టే హిట్ ఇవ్వటం రాజమౌళి, ప్రభాస్ వల్ల కూడా కాలేదు. మరి అప్ కమింగ్ సినిమాల్లో ఈ ఇద్దరిలో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసేదెవరు? ఆ ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది? ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి ఓ టర్నింగ్ పాయింట్.

అప్పటి వరకు ఉన్న బడ్జెట్, బిజినెస్ లెక్కలు మార్చేసిన బాహుబలి 2, ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఆ తరువాత ప్రతీ స్టార్ ఆ సినిమాను కొట్టాలన్న కసితోనే పాన్ ఇండియా మార్కెట్‌లోకి దిగుతున్నారు. కానీ ఇంత వరకు బాహుబలి రేంజ్ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద మళ్లీ రాలేదు.

బాహుబలి తరువాత లాంగ్ బ్రేక్ తీసుకొని ట్రిపులార్ సినిమా చేశారు రాజమౌళి. ఇద్దరు హీరోలతో చేసిన ఈ సినిమా కూడా బాహుబలి 2 రేంజ్‌లో పెర్ఫామ్ చేయలేకపోయింది. ఓవరాల్‌గా 1300 కోట్ల వసూళ్ల దగ్గరే ఆగిపోయింది ట్రిపులార్.

అలాగే ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. వీళ్ళందరి ఆశ ఒక్కటే.. ప్రభాస్‌తో హిట్ కొడితే 1000 కోట్లతో పాటు బోనస్‌గా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనే ముద్ర పడుతుంది.

మిగతా సినిమాలేవి కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేవు. అందుకే డార్లింగ్ తన రికార్డ్ తానే బ్రేక్ చేసే టైమ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ది రాజా సాబ్, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, వీటిలో ఏదో ఒక మూవీతో 1800 కోట్ల మార్క్‌ను బీట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.

సూపర్ హిట్ టాక్ వస్తే డార్లింగ్ సినిమాకు ఆ రేంజ్ వసూళ్లు పెద్ద విషయమేం కాదన్నది డై హార్డ్ ఫ్యాన్స్ వర్షన్. మరి బాహుబలి 2తో రాజమౌళి, ప్రభాస్ కలిసి సెట్ చేసిన రికార్డ్‌ను ముందు ఎవరు సోలోగా బ్రేక్ చేస్తారో చూడాలి.





























