Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: కిస్సిక్‌ను మించి.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. మీరు చూశారా?

మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను నటిస్తోన్న మొదటి సినిమా జూనియర్. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, మరో అందాల తార జెనీలియా మరో కీలక పాత్రలో కనిపించనుంది.

Sreeleela: కిస్సిక్‌ను మించి.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. మీరు చూశారా?
Sreeleela
Basha Shek
|

Updated on: Jul 06, 2025 | 7:21 PM

Share

ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన ‘జూనియర్’ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాతో ఒకేసారి కన్నడ, తెలుగు, తమిళ ఆడియెన్స్ ను పలకరించనున్నాడు కిరిటీ. మొదటి సినిమా అయినప్పటికీ జూనియర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ మూవీ క్యాస్టింగ్. అలాగే ఎంతో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారు. జూనియర్ సినిమాలో కిరిటీ రెడ్డి పక్కన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు సినీ అభిమానుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. లేటెస్ట్ గా జూనియర్ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’ అంటూ సాగే ఈ సాంగ్ ను ‘ఆదిత్య మ్యూజిక్’ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇక శ్రీలల అంతా కాకపోయినా కిరిటీ రెడ్డి కూడా బాగానే స్టెప్పులేశాడని సినీ ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ వయ్యారి పాట అన్ని భాషలలో కలిపి 6 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

‘వైరల్ వయ్యారి’ అనే పాటకు పవన్ భట్ సాహిత్యం రాశారు. హరిప్రియ మరియు దీపక్ బ్లూ స్వరాలు సమకూర్చారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ‘జూనియర్’ సినిమా జూలై 18న కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ‘మాయాబజార్’ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలకు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ ‘జూనియర్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి వైరల్ వయ్యారి’ పాట కిరిటీ రెడ్డి సినిమాపై అంచనాలను పెంచింది.

ఇవి కూడా చదవండి

6 మిలియన్లకు పైగా వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో..

వైరల్ వయ్యారీ సాంగ్ తెలుగు వెర్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.