AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Arjun: ఏమందంరా బాబు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్.. టీజర్ చూశారా?

విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది సారా అర్జున్. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో సినీ ప్రియుల మదిని దోచుకుంది. ఇప్పుడీ క్యూట్ గర్ల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ సినిమాతో..

Sara Arjun: ఏమందంరా బాబు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్.. టీజర్ చూశారా?
Sara Arjun
Basha Shek
|

Updated on: Jul 06, 2025 | 6:58 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దురంధర్. సంజయ్‌ దత్‌, ఆర్‌.మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌, అక్షయ్‌ ఖన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రణ్‌వీర్‌ బర్త్‌డే (జూలై 6) సందర్భంగా ఆదివారం దురంధర్‌ మూవీ టీజర్‌ ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే ఇందులోనూ మాస్‌ అవతార్‌లో కనిపించాడు హీరో రణ్ వీర్ సింగ్. అదే సమయంలో ఓ అందాల తారను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు. ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.. గతంలో పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా నటించిన సారా అర్జున్‌. ప్రముఖ నటుడు రాజ్‌ అర్జున్‌ కూతురైన సారా నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించింది. అందులో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో సినీ ప్రియుల మదిని దోచుకుంది. తెలుగులో దాగుడుమూతల దండాకోర్‌ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ మనవరాలిగానూ నటించింది సారా. ఆ తర్వాత ఎక్కువగా హిందీ సినిమాల్లోనూ బాల నటిగా ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ జయహో, ఐశ్వర్యారాయ్ జజ్బా, శాండ్ కీ ఆంఖ్ వంటి హిట్ సినిమాల్లో తళుక్కుమంది.

అలాగే మ్యాగీ, కల్యాణ్‌ జ్యువెలర్స్‌, క్లీనిక్‌ ప్లస్‌, మెక్‌ డొనాల్డ్స్‌.. వంటి ప్రముఖ సంస్థలు, ఉత్పత్తుల యాడ్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. ఇక 18 ఏళ్ల వయసులోనే రూ.10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న అత్యధిక పారితోషికం పొందిన బాలనటి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయా కథనాలపై సారా అర్జున్‌ ఎప్పుడూ స్పందించలేదు.  ఇక  2022లో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ తో మరోసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది సారా. అందులో ఐశ్వర్యరాయ్‌ చిన్ననాటి పాత్రలో ఎంతో అందంగా కనిపించింది. ఇలా బాల నటిగా బోలెడు క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దురంధర్ టీజర్ తో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపించింది. కాగా సారా వయసు ఇప్పుడు కేవలం 20 ఏళ్లు మాత్రమే. అదే సమయంలో 40 ఏళ్ల రణ్ వీర్ సింగ్ సినిమాలో నటించడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దురంధర్ సినిమాలో సారా అర్జున్..

దురంధర్ సినిమా సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్‌ ది రాజాసాబ్‌ మూవీ రిలీజ్‌ అవుతుండటం గమనార్హం.

సారా అర్జున్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్