Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
సామజవరగమన సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఈయన మరోసారి సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఓం భీమ్ బుష్. మరి అది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట ఎడిటింగ్: విజయ్ వర్ధన్ కావూరి నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
సామజవరగమన సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఈయన మరోసారి సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఓం భీమ్ బుష్. మరి అది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి సైంటిస్టులు కావాలి అనేది వాళ్ళ కోరిక. అందుకే పీహెచ్‌డీ పట్టా కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. అక్కడ వాళ్ళు చదువు తప్ప మిగిలిన పనులు అన్నీ చేస్తారు. చివరికి వాళ్లను కాలేజీ నుంచి గెంటేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) స్వయంగా తానే డాక్టరేట్ ఇచ్చి బయటకి పంపిస్తాడు. అక్కడి నుంచి బయటికి వెళ్లే క్రమంలో భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు ఈ ముగ్గురు. ఆ ఊర్లో కొందరు మాంత్రికులు ఊరు జనాన్ని మోసం చేసి డబ్బులు గుంజడాన్ని వీళ్లు గమనిస్తారు. తాము కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించొచ్చు అని భైరవపురం చేరుతారు. అయితే అక్కడ అనుకోకుండా వాళ్లకు ఒక దెయ్యం తారసపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.
కథనం:
దెయ్యం సినిమాలు చూస్తున్నపుడు లాజిక్కులు వేతక్కూడదు. అలాంటిది నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అని దర్శకుడే చెప్పాక అస్సలు ఆలోచించకూడదు. జస్ట్ ఎంజాయ్ చేయాలంతే.. ఓం భీమ్ బుష్ అలాంటి సినిమానే. ఆ సీన్ ఎందుకు వచ్చింది.. ఈ సీన్ ఎందుకు వచ్చింది.. అని ఆరా తీయకుండా చూస్తే కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు. అక్కడక్కడా A సర్టిఫికేట్ జోకులు పడినా ఎబ్బెట్టుగా అనిపించవు. ఫస్టాఫ్ కొన్ని సీక్వెన్సులు బాగా పేలాయి. ఇక సెకండాఫ్ మొదటి 45 నిమిషాలు హిలేరియస్. ప్రియదర్శి, దెయ్యం సీన్స్ అయితే కడుపులు చెక్కలే. రాహుల్ రామకృష్ణ, దెయ్యం సీన్స్ కూడా నవ్విస్తాయి. క్లైమాక్స్ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యేవరకు నాన్ స్టాప్ కామెడీ ఉంది. చివర్లో ఎమోషనల్ ముగింపు ఇచ్చాడు దర్శకుడు.. అక్కడ కాస్త స్లో అవుతుంది కానీ అప్పటికే పైసా వసూల్ కామెడీ ఉంటుంది. చివర్లో చెప్పిన కథ మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు రొటీన్ దయ్యం కథలు చూసిన వాళ్లకు ఇది రీ ఫ్రెషింగ్ అనిపిస్తుంది.
నటీనటులు:
శ్రీ విష్ణు మరోసారి తనదైన కామెడీతో కితకితలు పెట్టాడు. తన డైలాగ్ డెలివరీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రోల్స్ కీలకం.. రచ్చ రవి సీన్స్ అలరిస్తాయి. హీరోయిన్స్ ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఉన్నారంటే ఉన్నారంతే. శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించేది రెండు సీన్స్ అయినా కూడా బాగా నవ్వించాడు. మిగిలిన నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీమ్:
మామూలుగానే హారర్ కామెడీ సినిమాలకు మ్యూజిక్ కీలకం. ఈ సినిమాకు సన్నీ ఎంఆర్ తన వంతు న్యాయం చేశాడు. పాటలు ఓకే.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ ప్లస్ ఈ సినిమాకు. ఎక్కడా బోర్ రాకుండా కట్ చేసాడు. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. దర్శకుడు హర్ష రొటీన్ దెయ్యం కథ తీసుకున్నా.. చివర్లో ట్విస్ట్ ఇంట్రెస్టింగ్.. ఆయన చెప్పినట్టుగానే లాజిక్ లేని కామెడీ మ్యాజిక్ చేసాడు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా ఓం భీమ్ బుష్.. ఎంటర్టైన్మెంట్ పక్కా.. నో లాజిక్.. జస్ట్ ఎంజాయ్..