NTR Devara: రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్.. దేవర నుంచి కీలక సన్నివేశం లీక్
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు దేవర సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో వైరల్ అవుతోంది. లీకైన వీడియోలో తారక్ నల్ల చొక్కా, లుంగీ ధరించి దర్శకుడి ఆదేశాలను పాటిస్తూ సముద్ర తీరంలో నడుస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు దేవర సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో వైరల్ అవుతోంది. లీకైన వీడియోలో తారక్ నల్ల చొక్కా, లుంగీ ధరించి దర్శకుడి ఆదేశాలను పాటిస్తూ సముద్ర తీరంలో నడుస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. దేవర మొదటి భాగం అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తారని, తండ్రీకొడుకులుగా రెండు పాత్రలు పోషించనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే నిజానికి ఎన్నికల కంటే ముందుగా ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ సినిమా చేస్తుండటంతో దేవర మూవీపై కొంత ఎఫెక్ట్ పడింది. రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది.
#Devara Location 📸@tarak9999 ❤️🔥 pic.twitter.com/3DccF2gEEh
— MalayalamReview (@MalayalamReview) March 22, 2024



