AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: మీడియావాళ్లుంటే మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాను: రజనీకాంత్‌.

Rajinikanth: మీడియావాళ్లుంటే మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాను: రజనీకాంత్‌.

Anil kumar poka
|

Updated on: Mar 22, 2024 | 1:06 PM

Share

ఎన్నికల వేళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమయంలో ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తుందటూ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎందరో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే, కమల్‌ హాసన్ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు.

ఎన్నికల వేళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమయంలో ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తుందటూ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎందరో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే, కమల్‌ హాసన్ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు. ఇప్పుడు కమల్ హాసన్ వాళ్ల ఇల్లు కావేరీ ఆసుపత్రి దగ్గర అని చెబుతున్నారు. ఇది మామూలుగానే చెబుతున్నా.. మళ్లీ నాకూ, కమల్‌కు విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నానని, ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోందని సరదా కామెంట్స్ చేశారు. గతంలో తాను అనేక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నట్టు చెప్పిన రజనీ..వారి వల్లే తాను ఇప్పుడిలా హాయిగా ఉన్నట్టు తెలిపారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..