Singer Sunitha: ఆ విషాదంతో కన్నీళ్లు రావడం ఆగిపోయాయి.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు..
సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన గాత్రంతో శ్రోతలను మైమరపించారు సునీత. గాయనిగానే కాకుండా..
సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన గాత్రంతో శ్రోతలను మైమరపించారు సునీత. గాయనిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీత సుపరిచితురాలు. ఎన్నో వేల పాటలు పాడుతూ తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఇదిలా ఉంటే.. సింగర్ సునీతకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె షేర్ చేసే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే నెట్టింట్లో తన గాత్రంతో పాటలు పాడుతూ.. లైవ్ వీడియోస్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటారు సునీత. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సెకండ్ మ్యారేజ్ చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు సునీత. వివాహం అనంతరం కూడా సునీత తన కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గోన్న సునీత పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
సునీత మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది నా ముఖంలోనే కన్పిస్తుంది. నా జీవితం నాకు నచ్చినట్లు గౌరవంగా బతకాలనుకున్నాను.. అలాగే బతుకుతున్నాను. నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది. ఇక ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు ఎప్పుడైనా సాయం కావాలంటే చేస్తా. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తా అంటూ చెప్పుకొచ్చారు సునీత. అలాగే 2021లో ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకున్నానని… ముఖ్యంగా బాలుగారిని పోగొట్టుకున్నానని.. ఆ విషాదంతో కన్నీళ్లు రావడం ఆగిపోయాయి అని తెలిపారు. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుందని.. కానీ అంతగా తనను కదిలించడం లేదని .. బాలు గారు లేని లోటు తీర్చలేనిదంటూ ఎమోషనల్ అయ్యారు సునీత.
Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..
Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
Ilayaraja: వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..
RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..