Liger: యూట్యూబ్‏లో రౌడీ మేనియా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న లైగర్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‏కు న్యూఇయర్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ఈరోజు విడుదలైన లైగర్ గ్లింప్స్‏తో అభిమానుల్లో

Liger: యూట్యూబ్‏లో రౌడీ మేనియా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న లైగర్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2021 | 6:45 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‏కు న్యూఇయర్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ఈరోజు విడుదలైన లైగర్ గ్లింప్స్‏తో అభిమానుల్లో కొత్త సంవత్సరం జోష్ నింపారు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంలో చూపిస్తూ ఫ్యాన్స్‏కు న్యూఇయర్ ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు డైనమిక్ డైరెక్టర్ పూరి. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‏గా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లైగర్ గ్లింప్స్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోంది.

ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మెకోవర్.. యాటిట్యూడ్‏తో కనిపించాడు విజయ్. ముంబై వీధుల్లో చాయ్ వాలాగా జీవించే వ్యక్తి బాక్సర్‏గా ఎలా ఎదిగాడనేది చూపించారు పూరి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‏తో లైగర్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‏తో  రూపొందిస్తున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను పాన్ ఇండియన్ స్టార్ గా  చేయబోతున్నారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అటు విజయ్.. ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే.

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు విడుదలైన లైగర్ గ్లింప్స్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 10 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో  అదిరిపోయే రెస్పాన్స్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా నెంబర్ వన్ ట్రెండింగ్‏లో దూసుకుపోతుంది లైగర్. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్‏ను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు పూరి. ప్రస్తుతం లైగర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..

Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

Ilayaraja: వీడియోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..

RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!