సినిమా టిక్కెట్లపై వివాదం సద్దుమణిగినట్లేనా ?.. థియేటర్లకు ప్రభుత్వ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలేంటీ ?
సినిమా టిక్కెట్లపై వివాదమేంటి? దీని వెనుకున్న గందరగోళమేంటి? వినోదం పేరుతో జరుగుతున్న దోపిడీ ఎంత? సినిమా టిక్కెట్
సినిమా టిక్కెట్లపై వివాదమేంటి? దీని వెనుకున్న గందరగోళమేంటి? వినోదం పేరుతో జరుగుతున్న దోపిడీ ఎంత? సినిమా టిక్కెట్ నిర్ణయంలో అనుసరించాల్సి విధానమేంటి? తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం నియమించిన 13 మందితో కూడిన కమిటీ సమావేశమైంది. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వకమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తోంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలో.. 13 మందితో కమిటీ నియమించింది ఏపీ ప్రభుత్వం.
సినిమా టికెట్ల ధరలు ఎంత ఉండాలనే దానిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు నిర్ణయించింది. ఈ రేట్లకు మించి అమ్మితే థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. థియేటర్లలో సౌకర్యాలు, పార్కింగ్, అక్కడ విక్రయించే తినుబండారాల ధరలపైనా మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నింటికీ మించి కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి పలికింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35పై కొంతమంది థియేటర్ యజమానులు కోర్టుకెక్కారు. మరోవైపు టికెట్ రేట్ల తగ్గింపుపై కొంతమంది సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టికెట్ రేట్ల నిర్దారణపై కమిటీ వేసింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టికెట్ రేట్లలో మార్పు చేయనుంది.
Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..
Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
Ilayaraja: వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..
RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..