AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa The Rise: మరోసారి సత్తా చాటిన ‘పుష్ప’.. ఏకంగా 12 కేటగిరిల్లో నామినేట్‌ అయిన ఐకాన్ స్టార్ సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Pushpa The Rise: మరోసారి సత్తా చాటిన 'పుష్ప'..  ఏకంగా 12 కేటగిరిల్లో నామినేట్‌ అయిన ఐకాన్ స్టార్ సినిమా
Pushpa 1
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2022 | 4:20 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప(Pushpa ). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించారు. మునుపెన్నడూ చూడని గెటప్ లో ఆకట్టుకునే యాటిట్యూడ్ తో బన్నీ నటన ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఈ సినిమాను సుకుమార్ రెండు భాగాలూ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటించారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు. ఇక పుష్ప ఇనిమ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లోనూ అత్యధిక వసూళ్లను రాబట్టి వండర్ క్రియేట్ చేసింది పుష్ప.

ఇక పుష్ప సినిమాలోని పాటలైతే ఇప్పటికీ మారుమ్రోగుతున్నాయి. దేశాలు దాటి ఈ పాటలు ట్రెండ్ అయ్యాయి. దేవీ శ్రీ అందించిన సంగీతం యావత్ ప్రపంచాన్నే ఉర్రుతలూగించింది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ మూవీ. సైమా అవార్డుల వేడుకలో ఈ సినిమా ఏకంగా 12 క్యాటగిరిలో నామినేట్ అయ్యి అగ్రస్థానంలో నిలిచింది. సైమా అవార్డుల ప్రదానోత్సవం వచ్చే నెల 10, 11 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. తాజాగా ఈ అవార్డులకు నామినేట్ అయిన సినిమాల జాబితాను వెల్లడించారు. తెలుగులో ‘పుష్ప’ , ‘అఖండ’ , ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’ ఎక్కువ విభాగాల్లో నామినేటైనట్లు ప్రకటించారు. వీటిలో పుష్ప అగ్రస్థానంలో ఉండగా బాలయ్య అఖండ సినిమా రెండో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్