Arjun Kapoor: “మేమే తప్పు చేశాం”.. బాయ్‌కాట్ ట్రెండ్ పై స్పందించిన యంగ్ హీరో

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మితిమీరుతున్నాయి. సినిమా తరాల వ్యక్తిగత విషయాల పై చాలా ట్రోల్స్ నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.

Arjun Kapoor: మేమే తప్పు చేశాం.. బాయ్‌కాట్ ట్రెండ్ పై స్పందించిన యంగ్ హీరో
Arjun Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 17, 2022 | 5:05 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మితిమీరుతున్నాయి. సినిమా తరాల వ్యక్తిగత విషయాల పై చాలా ట్రోల్స్ నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే చాలు బాయ్‌కాట్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు కొందరు. ఇటీవల అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాకు కూడా ఈ బెడద తప్పలేదు. సినిమా రిలీజ్ సమయంలో పెద్ద ఎత్తున సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొంతమంది రచ్చ చేశారు. అది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించింది. ఇక బాయ్‌కాట్ పదం ట్రెండ్ అవ్వడం పై తాజాగా యంగ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor)స్పందించాడు. బాయ్‌కాట్ ను ట్రెండింగ్ పై అర్జున్ మండిపడ్డాడు.

మేమే తప్పు చేశాం.. ఈమధ్య కాలంలో బాయ్‌కాట్ అనే పదాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు కొందరు. మేము దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోవాల్సింది. దీని పై మేము చర్యలు తీసుకోకపోవడాన్ని కొంతమంది అవకాశంగా తీసుకుంటున్నారు. కావాలనే బాయ్‌కాట్ అనే పదాన్ని వాడి ట్రెండ్ చేస్తున్నారు. మన టాలెంట్ గురించి మన సినిమాలే చెప్తాయి అని నమ్మే వాళ్ళం మేము.మంచి సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాం.. మేము సైలెంట్ గా ఉంటే దాన్ని కొంతమంది చేతకాని తనంగా భావిస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఇష్టం వచ్చిన వార్తలు, హ్యాష్‌ట్యాగ్స్‌ క్రియేట్ చేస్తూ మాపై బురద జల్లుతున్నారు. ఇప్పటికైనా సినిమా తారలంతా దీని పై స్పందించాలి, ఇలాంటివి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ..అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..