SitaRamam: బ్యాడ్‏లక్ అంటే ఇదే.. ఆ ఇద్దరు హీరోలు వదులుకున్నారు.. దుల్కర్ హిట్ కొట్టాడు..

రామ్ పాత్రలో దుల్కర్, సీతామహాలక్ష్మీ పాత్రలో మృణాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీతారామం థియేటర్లలో

SitaRamam: బ్యాడ్‏లక్ అంటే ఇదే.. ఆ ఇద్దరు హీరోలు వదులుకున్నారు.. దుల్కర్ హిట్ కొట్టాడు..
Sitaramam
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 17, 2022 | 1:40 PM

డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం (Sitaramam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ పాత్రలో దుల్కర్, సీతామహాలక్ష్మీ పాత్రలో మృణాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీతారామం థియేటర్లలో దూసుకపోతుండగా.. మరోవైపు ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ ఆడియన్స్ మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర కోసం దుల్కర్ కంటే ముందుగా ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్, మేకర్స్ కలిసి న్యాచురల్ స్టార్ నాని, రామ్ పోతినేనిని సంప్రదించగా.. డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరు ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. దీంతో ఈ ఆఫర్ దుల్కర్ వద్దకు వెళ్లింది. ఇక కంటెంట్ నచ్చడంతో రామ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. వైజయంతీ మూవీస్ నిర్మి్ంచిన ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుని వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఏదైనా ఆ స్టార్ హీరోస్ ఇద్దరు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను కోల్పోయారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.