AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Shankar Master: సోమవారం మహా ప్రస్థానంలో శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి..

Shiva Shankar Master: సోమవారం మహా ప్రస్థానంలో శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు..
Shiva Shankar Master
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 10:14 PM

Share

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. కాగా ఇటీవలే కరోనా బారిన పడిన శివశంకర్‌ మాస్టర్‌ను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరే సమయానికి మాస్టర్‌ ఊపిరితిత్తులకు ఇనెఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. గత కొద్దిరోజులగా ఆస్పత్రిలోనే ఉంటోన్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా శివశంకర్‌ భౌతిక కాయానికి రేపు (సోమవారం) మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసానికి మాస్టర్‌ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. అయితే శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఏఐజీ వైద్యులు తెలిపారు.

ప్రముఖుల నివాళి.. కాగా శివశంకర్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రాజమౌళి లాంటి పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళి అర్పి్స్తున్నారు. ‘ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గారు మరణించారని తెలిసి బాధగా ఉంది. ‘మగధీర’ కోసం ఆయనతో కలిసి పనిచేయడం నా జీవితంలో మరపురాని అనుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు’ అని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. ‘శివశంకర్ మాస్టర్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన నన్నెంతో ప్రోత్సహించారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు నా సానుభూతి. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.Also Read:

Shiva Shankar Master: ఏడాదిన్నర వయసులో గాయపడిన శివ శంకర్ మాస్టర్.. 8 ఏళ్ల పాటు బెడ్ రెస్ట్.. ఎందుకంటే..

KNOW THIS: మైక్‌ టైసన్‌ మ్యాచ్‌కి ముందు సెక్స్‌ చేసేవాడు !! అదీ ఒకరిద్దరితో కాదు, ఏకంగా !! వీడియో

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..