Shiva Shankar Master: ఏడాదిన్నర వయసులో గాయపడిన శివ శంకర్ మాస్టర్.. 8 ఏళ్ల పాటు బెడ్ రెస్ట్.. ఎందుకంటే..
Shiva Shankar Master: కరోనా వైరస్ రక్కసి కోరల్లో చిక్కుకుని అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. పెద్దలు, పిల్లలు అనే తేడాలేకుండా కోవిడ్ బారినపడి మరణించారు. కరోనా బారినపడి..
Shiva Shankar Master: కరోనా వైరస్ రక్కసి కోరల్లో చిక్కుకుని అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. పెద్దలు, పిల్లలు అనే తేడాలేకుండా కోవిడ్ బారినపడి మరణించారు. కరోనా బారినపడి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలేదు… దాదాపు అని చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా మరణించారు. ఇప్పటికే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక మంది కరోనా బారిన పడి మరణించగా తాజాగా ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కూడా కోవిడ్ తో పోరాడుతూ.. చివరికి ఓడిపోయి మృత్యుఒడిలోకి చేరుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కోలుకోవాలని ఎందరో కోరుకున్నారు. అయినప్పటికీ ఎవరి ప్రార్ధనలు కరోనా రక్కసి నుంచి ఆయన్ని కాపాడలేకపోయాయి.
తమిళనాడులోని చెన్నై లో 1948 డిసెంబరు 7వ తేదీన కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ దంపతులకు శివశంకర్ మాస్టర్ జన్మించారు. శివ శంకర్ మాస్టర్‌కు చిన్నతనంలో ఒక ప్రమాదం జరిగిందట. ఇప్పుడు ఆ ప్రమాదం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు.
ఇంటి అరుగుమీద శివ శంకర్ మాస్టర్ పెద్దమ్మ ఒడిలో కూర్చుని ఏడాదిన్నర వయసు ఉన్న శివశంకర్ మాస్టర్ రోజూ ఆడుకునేవారట. ఒకరోజు పెద్దమ్మ ఒడిలో శివ శంకర్ మాస్టర్ ఉన్న సమయంలో.. ఒక ఆవు తాడు తెంపుకుని రోడ్డుమీద కు వచ్చిందట.. అది చూసిన ఆమె తన మీదకు ఆవు వస్తుందని భయపడి.. వెంటనే శివ శంకర్ మాస్టర్ ని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్లే హడావిడి.. గడప తగిలి.. గుమ్మం దగ్గర పడిపోయింది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న చిన్నారి శివ శంకర్ కూడా కింద పడిపోయారు. అప్పడు ఆయన తీవ్ర జ్వరం వచ్చిందట. అంతే కాదు వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీంతో శివ శంకర్ మాస్టర్ చెన్నైలోని ప్రముఖ డాక్టర్ నరసింహ అయ్యర్ దగ్గరకు చికిత్స కోసం తీసుకుని వెళ్లారు. అప్పుడు పరీక్షలో వెన్నెముక విరిపోయిందని..తేలింది. అయితే డాక్టర్ తన దగ్గర శివ శంకర్ మాస్టర్ ని వదిలితే.. నడిచేలా చేస్తానని హామీనిచ్చారు. దీంతో దాదాపు ఎనిమిదేళ్లపాటు శివ శంకర్ పడుకునే ఉన్నారు. అనంతరం ఆ గాయం నుంచి కోలుకున్నారు.
చిన్నతనం నుంచి పాటలన్నా, నాట్యమన్నా ఇష్టపడే శివ శంకర్ మాస్టర్ తనకు తానుగానే డ్యాన్స్ ను నేర్చుకున్నారు. 16 ఏళ్ల వయసు లోనే ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. వెండి తెరపై మొదటి సహాయకుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ‘కురు వికూడు’ సినిమాతో డ్యాన్స్ మాస్టర్ గా మారారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. తెలుగు, తమిళ సహా సుమారు 10 భాషల్లో 800 లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. బుల్లి తెరపై పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఆయనకు భార్య, విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
Also Read: మీ శరీరంలో చెడు కొలెస్టాల్ చేరిందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవల్సిందే!