Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి

కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు.

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి
Chiru
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2021 | 9:24 PM

Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం అన్నారు.

చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shiva Shankar Master : సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

KBC Contestant: ఓ చెట్టు రబ్బరు నుంచి తయారు చేసే మసాలా.. భారతీయ వంటల్లో వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

K.G.F: Chapter 2: ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న “కేజీఎఫ్” టీమ్.. మరోసారి సినిమా వాయిదా తప్పదా..?