K.G.F: Chapter 2: ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న “కేజీఎఫ్” టీమ్.. మరోసారి సినిమా వాయిదా తప్పదా..?

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నాడు హీరో యశ్. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది.

K.G.F: Chapter 2: ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న కేజీఎఫ్ టీమ్.. మరోసారి సినిమా వాయిదా తప్పదా..?
Kgf
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2021 | 8:16 PM

K.G.F: Chapter 2: కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నాడు హీరో యశ్. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అత్యంత విజయాన్ని అందుకున్న భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీ సీక్వెల్‏గా కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి కరోనా బ్రేక్ వేసింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కేజీఎఫ్ 2 పై మరింత క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు 2022 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు సార్లు మార్పు వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. మళ్ళీ ఈసినిమా రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ గా మారింది. కేజీఎఫ్ 2 కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను రీ షూట్ చేయాలనుకుంటున్నారట. అందుకోసం సినిమా విడుదలను వాయిదా వేయాలని చూస్తున్నారట. సినిమా విడుదల వచ్చే ఏడాది చివరి వరకు ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya: సిద్ద వచ్చేశాడు.. “ఆచార్య” పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌

D. Suresh Babu : అందుకే “దృశ్యం 2” సినిమాను థియేట్సర్స్‌కు ఇవ్వలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన సురేష్ బాబు..