Acharya: సిద్ద వచ్చేశాడు.. “ఆచార్య” పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం.

Acharya: సిద్ద వచ్చేశాడు.. ఆచార్య పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్
Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2021 | 4:45 PM

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం. రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. సురేఖ్‌ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇటు మెగా అభిమానులే కాకుండా యావత్‌ సినీ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమానుంచి రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక చరణ్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు చిత్రయూనిట్. ధర్మస్థలికి ఆపద వస్తే ఆ అమ్మోరుతల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక చివరిలో ఓ చెరువు దగ్గర చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే తల్లి చిరుత వెనుక ఉన్న విజువల్ చూపించారు.. అచ్చం అలాగే చరణ్ నీళ్లు తాగుతుంటే.. చిరు చరణ్ వెనుక ఉన్న సీన్ చూపించారు. ఇక ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda Pre Release Event photos: అఖండ మొదటి గర్జనలో సందడి చేసిన పుష్పరాజ్ , బాలయ్య..(ఫొటోస్)