AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌

బాలీవుడ్‌లో డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ బూటీల జాబితా తీస్తే అందులో నటి స్వరా భాస్కర్‌ కచ్చితంగా ఉంటారు. మహిళా సమస్యలపై, సమాజంలో జరిగే విషయాలపై నిర్మోహమాటంగా తన గళాన్ని..

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 3:40 PM

Share

బాలీవుడ్‌లో డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ బూటీల జాబితా తీస్తే అందులో నటి స్వరా భాస్కర్‌ కచ్చితంగా ఉంటారు. మహిళా సమస్యలపై, సమాజంలో జరిగే విషయాలపై నిర్మోహమాటంగా తన గళాన్ని వినిపిస్తుంటారీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా కొన్ని నెలల క్రితం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్సీ) చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో స్వరా కూడా భాగమైంది. నిరసనకారులకు మద్దతుగా సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించింది. అయితే ఇలా చేయడం వల్ల తన ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులు రద్దయ్యాయంటూ తాజాగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

‘సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా నా మనసులో ఉన్న అభిప్రాయాలను తెలియజేశాను. అయితే ఈ కారణంగానే నాతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న చాలా కమర్షియల్ బ్రాండ్లు, ఎండార్స్‌మెంట్ల రద్దయ్యాయి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటూ తమ ప్రాడక్ట్స్‌కు చెడ్డ పేరు తెస్తోందని ఆయా బ్రాండ్ల ప్రతినిధులు నన్ను తొలగించారు. అయితే నేను మాత్రం బాధపడలేదు. ఎందకంటే ఈ దేశంలోని రాజ్యాంగబద్ధమైన విలువల కోసం ఎవరు, ఎలా నన్ను శిక్షించినా నేను వెనకడుగు వేయను’ అని స్వర చెప్పుకొచ్చింది. కాగా ఆమె ఇటీవల ఓ అనాథ బిడ్డను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్వర ‘షీర్‌ ఖుర్మా’ అనే సినిమాలో నటిస్తోంది.

Also Read:

Bandla Ganesh: మరోసారి మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. ఏం చేశారంటే..

S. S. Rajamouli: మీడియాకు క్షమాపణలు చెప్పిన దర్శక ధీరుడు.. కారణం ఇదే..

Puneeth Raj Kumar: అప్పుపై అభిమానంతో.. ఓ అభిమాని నివాళులర్పిస్తూ.. తిరుమల కొండకు పాదయాత్ర

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌