Bandla Ganesh: మరోసారి మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. ఏం చేశారంటే..

కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన బండ్ల గణేశ్‌ ఆతర్వాత నిర్మాతగా మారి హిట్‌ సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు హీరోగా 'డేగల బాబ్జీ'గా మన ముందుకు వస్తున్నారు

Bandla Ganesh: మరోసారి మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. ఏం చేశారంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2021 | 3:19 PM

కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన బండ్ల గణేశ్‌ ఆతర్వాత నిర్మాతగా మారి హిట్‌ సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు హీరోగా ‘డేగల బాబ్జీ’గా మన ముందుకు వస్తున్నారు. క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. కాగా కరోనా ఆపత్కాల సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా అడిగిన వారందరికీ ఆపన్న హస్తం అందించారు బండ్ల. తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి మనస్సు చాటుకున్నారు. కాగా గణేశ్‌ ఓ నేపాల్‌ చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఇందులో ‘ అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకుని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. కానీ నేను మాత్రం ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నాను. ఈ చిన్నారిని గొప్పగా చదివించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాప మా ఇంట్లో సభ్యురాలిగా మారిపోయింది. ఇప్పుడు మమ్మల్నే బెదిరించే స్థాయికి వచ్చింది’ అని సరదాగా చెప్పుకొచ్చారు. కాగా బండ్ల గణేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఆయన హీరోగా నటిస్తోన్న ‘డేగల బాబ్జీ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకట్‌ చంద్ర దర్శకుడిగా పరిచయం కానున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:

S. S. Rajamouli: మీడియాకు క్షమాపణలు చెప్పిన దర్శక ధీరుడు.. కారణం ఇదే..

Puneeth Raj Kumar: అప్పుపై అభిమానంతో.. ఓ అభిమాని నివాళులర్పిస్తూ.. తిరుమల కొండకు పాదయాత్ర

Rashmika Mandanna: అల్ ఎక్స్ప్రెషన్స్ వన్ ఫ్రేమ్ ఎట్రాక్ట్ చేస్తున్న ‘రష్మిక మందన్న’.. (ఫొటోస్)