S. S. Rajamouli: మీడియాకు క్షమాపణలు చెప్పిన దర్శక ధీరుడు.. కారణం ఇదే..
కేవలం తెలుగులోనే కాకుండా ఇతరభాషల్లోను పేరు ప్రఖ్యాతలు సంపాదించినా దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని పెంచారు జక్కన్న.
S. S. Rajamouli : కేవలం తెలుగులోనే కాకుండా ఇతరభాషల్లోను పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని పెంచారు జక్కన్న. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ గిరిజన వీరుడు కొమురం భీంగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, గ్లిమ్ప్స్, సాంగ్స్ ఇలా అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇటీవలే విడుదలైన నాటు నాటు సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ మాస్ మసాలా సాంగ్ లో చరణ్, తారక్ ఇద్దరు కలిసి డాన్స్ దుమ్మురేపారు. అలాగే రీసెంట్ గా జనని అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటను పలు భాషల్లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈపాట తమిళ్ వర్షన్ ఉయిరే ను చెన్నైలో లాంచ్ చేశారు జక్కన్న. ఈసందర్భంగా అక్కడి మీడియాకు క్షమాపణలు చెప్పారు. రాజమౌళి- చిత్ర నిర్మాత డివివి దానయ్య – ఆర్.ఆర్.ఆర్ తమిళ వెర్షన్ ను సమర్పిస్తున్న బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు చెన్నైలో జరిగిన ఉయిరే లాంచ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరలనుంచి తమిళ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం కుదరలేదని అందుకు తనను క్షమించాలని అన్నారు. ఇక సినిమా విడుదల కు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషన్స్ లో తప్పకుండ మాట్లాడుతానని అన్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ తమిళ హక్కుల కోసం లైకా సంస్థ భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకుందని టాక్ వినిపిస్తుంది. జనవరి 7నే ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :