Disha Patani: క్రేజీ హీరోయిన్ కెరీర్ పై సర్జరీ దెబ్బకొట్టిందా.. ఆఫర్లు చేజారుతున్నాయంటున్నారే..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ దిశాపటాని.

Disha Patani: క్రేజీ హీరోయిన్ కెరీర్ పై సర్జరీ దెబ్బకొట్టిందా.. ఆఫర్లు చేజారుతున్నాయంటున్నారే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2021 | 5:14 PM

Disha Patani: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ దిశాపటాని. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత దిశాపటాని బాలీవుడ్ కె పరిమితం అయ్యింది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాలకు హద్దులే ఉండవు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ చిన్నది. బికినీ అందాలకు దిశా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ మెరుపుతీగ.

ఇదిలా ఉంటే తాజాగా ‘అంతిమ్’ స్పెషల్ స్క్రీనింగ్  హాజరైన దిశాపటాని చూసి అందరు షాక్ అయ్యారు. అమ్మడి లుక్ ఎదో తెగ కొట్టినట్టు కనిపిస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తన ముక్కుకు .. పెదాలకు ఆమె సర్జరీ చేయించుకున్నట్టుగా భావిస్తున్నారు.సర్జరీ విక‌టించ‌డంతో ఆమె ముఖం కాస్త మారిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోలు వైర‌ల్అవుతున్నాయి. ఇప్పటికే పలువుడ్ సినిమా తారలు సర్జరీలు చేసుకొని ముఖాలన్ని పాడు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దిశా కూడా తన అందమైన మొఖాన్ని సర్జరీతో పాడు చేసుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘అంతిమ్’ ఈవెంట్ యూ హాజరైన దిశా ఎల్లో క్రాప్ టాప్, డెనిమ్స్ ధ‌రించి ఆమె వ‌చ్చింది. అనంతరం ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఆమెను చూసిన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త టాక్ వినిపిస్తుంది. ఇక పై ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గనున్నాయని అంటున్నారు. సర్జరీ తర్వాత దిశను చూసిన కొందరు దర్శక నిర్మాతలు మనసు మార్చుకుంటున్నారట. కొంతమంది దర్శకులు తమ రాబోయే సినిమాలకు ఈ అమ్మడు వద్దు అని అనుకుంటున్నారట.  దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గితే తెలుగులో అయినా ప్రయత్నించాలని చూస్తుందట దిశా.. మొత్తానికి సర్జరీ అమ్మడి కెరీర్ పై గట్టి దెబ్బె కొట్టేలా కనిపిస్తుంది.

Disha

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda Pre Release Event photos: అఖండ మొదటి గర్జనలో సందడి చేసిన పుష్పరాజ్ , బాలయ్య..(ఫొటోస్)

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Akhanda Pre Release Event Highlights: బోయపాటి బాలయ్య గర్జనలో భాగంగా.. అఖండ ప్రీ రిలీజ్ హైలైట్స్..(వీడియో)