Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్టాల్ చేరిందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవల్సిందే!

Cholesterol Types: మన శరీరంలో కొలెస్ట్రాల్ అనగానే చాలామంది భయపడిపోతారు. కానీ ఈ కొలెస్ట్రాల్స్ లో రెండు రకాల ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, ఇంకొకటి చెడు కొలెస్ట్రాల్..

Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్టాల్ చేరిందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవల్సిందే!
Cholesterol
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 6:02 PM

Cholesterol Types: మన శరీరంలో కొలెస్ట్రాల్ అనగానే చాలామంది భయపడిపోతారు. కానీ ఈ కొలెస్ట్రాల్స్ లో రెండు రకాల ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, ఇంకొకటి చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ ను హెచ్‌డీఎల్ అని, చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ అని అంటారు. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మంచే చేస్తుంది. అయితే సమస్య అంతా చెడు కొలెస్ట్రాల్‌తోనే. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే.. అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శరీరంలో చేదు కొవ్వు అధికంగా ఉందని .. కొన్ని లక్షణాల ద్వారా ముందుగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాడ్ కొలెస్టాల్ అధికంగా ఉంటె.. రక్తం సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకొక్కసారి అధిక రక్తపోటు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఇక ఒకొక్కసారి ఈ చెడు కొలెస్ట్రాల్ అధికమైనప్పుడు చ‌ర్మంపై ప‌సుపు లేదా ఎరుపు రంగులో కురుపులు వ‌స్తాయి. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, చేతులు, పాదాలు, ముక్కుపై ఈ కురుపులు వ‌స్తాయి. ఇవి ఒకొక్కసారి పెద్దగా కూడా ఏర్పడతాయి. వీటిని ఒకొక్కసారి మొటిమలు అంటూ నిర్లక్ష్యం చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలా కురుపులు కనిపించిన వెంటనే శరీరంలోని కొవ్వు గురించి టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

పరీక్షలో వచ్చిన ఫలితాలను బట్టి.. వైద్య చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే దిశగా ప్రయత్నాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఈ సమస్యకు గురయ్యాక అందులోంచి బయటపడేందుకు ప్రయత్నం మొదలు పెట్టేకంటే.. ముందుగా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. చేదు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

Also Read:  అల్పపీడన నేపథ్యంలో ఏపీలోని ఆ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక.. రేపు స్కూళ్లకు సెలవు