Bigg Boss 5 Telugu: యాంకర్ రవి ఎలిమినేషన్‌పై భగ్గుమన్న ఫ్యాన్స్.. లెక్క బయటపెట్టాలని హౌజ్ ముందు రచ్చ..
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో ఇప్పటి వరకు గొడవలు, గోలలు, ఏడుపులు, ఎమోషన్స్‌తో సాగుతోన్న హౌజ్ వారంతం వచ్చేసరికే ఉత్కంఠతకు తెర తీసింది....

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో ఇప్పటి వరకు గొడవలు, గోలలు, ఏడుపులు, ఎమోషన్స్‌తో సాగుతోన్న హౌజ్ వారంతం వచ్చేసరికే ఉత్కంఠతకు తెర తీసింది. తాజాగా ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతోన్న నేపథ్యంలో మొదటి నుంచి స్ట్రాంట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రవినే బిగ్‌బాస్ విన్నర్‌గా ఊహించుకున్న అభిమానులు ఇప్పుడు అతను ఎలిమినేట్ అవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో ఓ అడుగు ముందుకేసి కొందరు అభిమానులు బిగ్ బాస్ హౌజ్ వద్ద నిరసనకు దిగారు. యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ ఆరోపిణిస్తున్నారు. అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ జాగృతి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బిగ్‌బాస్ చరిత్రలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయని నిరసనలు వచ్చిన సందర్భాల్లో బిగ్‌బాస్ నిర్వాహకులు స్పందించలేదు. మరి ఇప్పుడైనా ఈ వ్యవహారంపై స్పందిస్తారో లేదో చూడాలి. రవి ఎలిమినేట్ అవ్వడంతో బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: Nayanthara: నయన్ డిమాండ్‌కు.. నోరెళ్లబెట్టిన చిరు టీం !! వీడియో
సిక్స్ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో