Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్‌ల మధ్య ఉన్న బంధం ప్రేమేనా.? ఎలిమేషన్ తర్వాత రవి ఆసక్తికర వ్యాఖ్యలు..
Bigg Boss 5 Telugu: ఊహించింది జరిగితే అది బిగ్‌బాస్ ఎందుకు అవుతుంది అన్నట్లు.. అందరి ఊహలు తలకిందులు చేస్తూ యాంకర్ రవి ఎలిమేట్ అయిన విషయం తెలిసిందే....

Bigg Boss 5 Telugu: ఊహించింది జరిగితే అది బిగ్‌బాస్ ఎందుకు అవుతుంది అన్నట్లు.. అందరి ఊహలు తలకిందులు చేస్తూ యాంకర్ రవి ఎలిమేట్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ రవి ఎలిమినేషన్‌ను ప్రకటించగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి రవి బిగ్‌బాస్ విన్నర్ రేసులో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఎలిమినేట్ అవ్వడంతో.. కొందరు రవి అభిమానులు ఏకంగా అన్నపూర్ణ స్టూడియోస్ ముందు నిరసనకు దిగారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ తీవ్ర గందరగోళానికి గురి చేశారు.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత రవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన వారిని బిగ్‌బాస్ బజ్ షోలో ఇంటర్వ్యూలు చేస్తారనే విషయం తెలిసిందే. తాజాగా నిర్వాహకులు ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అరియానా అడిగిన కొన్ని ప్రశ్నలకు రవి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. రవి మాట్లాడుతూ.. తన ఎలిమినేషన్‌ను అస్సలు ఊహించలేదని, ఇది పూర్తిగా షాక్‌కి గురి చేసిందని చెప్పుకొచ్చాడు. షణ్ముక్ ఆటతీరు గురించి మాట్లాడుతూ.. ‘అసలు షణ్ను ఎక్కడ గేమ్ ఆడుతున్నాడో నాకు మాత్రం కనిపించలేదని’ తెలిపాడు. పింకీకి మానస్ మీదున్న ఇష్టం.. మానస్‌కు పింకీ మీద సగం కూడా లేదని రవి షాకింగ్ కామెంట్ చేశాడు.
అంతేకాకుండా సిరి, షణ్ముఖ్‌ల మధ్య బంధం గురించి మాట్లాడుతూ.. ‘షణ్ముఖ్ దీప్తిని ఎంత ప్రేమిస్తున్నాడో.. సిరి, చోటును (శ్రీహాన్) ఎంత ప్రేమిస్తుందో.. ఇద్దరికీ తెలుసు. కానీ ఇద్దరు… సిరికి షణ్ముఖ్ అంటే ఇష్టమని నాకు చెప్పింది’ అని కొత్త చర్చకు దారి తీశాడు రవి. పూర్తి ఇంటర్వ్యూ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రసారంకానుంది. మరి రవి ఇంకేం మాట్లాడాడో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే.
Also Read: Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో
పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో
Vastu Tips: లక్ష్మీదేవి నిలవాలంటే ఈ వాస్తు తప్పులు అస్సలు చేయకండి.. చాలా కోల్పోతారు..