Ram Charan: శంకర్ అంటే ఆ మాత్రం ‘రిచ్‌’ ఉండాల్సిందే.. గేమ్ ఛేంజర్ పాటల కోసమే ఏకంగా అన్ని కోట్ల ఖర్చు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎలాంటి సినిమానైనా భారీ స్థాయిలో తీయడం ఆయన స్టైల్.

Ram Charan: శంకర్ అంటే ఆ మాత్రం 'రిచ్‌' ఉండాల్సిందే.. గేమ్ ఛేంజర్ పాటల కోసమే ఏకంగా అన్ని కోట్ల ఖర్చు
Game Changer Movie
Follow us

|

Updated on: Mar 19, 2024 | 6:52 PM

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత ఆచార్యలో నటించినా ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎలాంటి సినిమానైనా భారీ స్థాయిలో తీయడం ఆయన స్టైల్. ‘రోబో’, ‘శివాజీ’, ‘అన్నియన్‌’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న శంకర్.. కేవలం పాటల షూటింగ్ కోసమే 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలు, ఫైట్‌ల విషయంలో పూర్తిగా డిఫరెంట్‌గా రిచ్‌గా షూట్ చేస్తుంటాడు. వెయ్యి-రెండు వేల మంది డ్యాన్సర్లతో షూటింగ్ చేయడం, ఐదు నిమిషాల పాట కోసం భారీ సెట్ వేయడం, కొత్త పాటలో కథ చెప్పడం, సినిమా కోసం ఖర్చు చేసినంత డబ్బు పాటల చిత్రీకరణకు ఖర్చు చేస్తుంటాడు శంకర్. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయంలోనూ అదే పంథాను ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఐదు పాటల కోసం శంకర్ ఇప్పటికే 60 కోట్లకు పైగా ఖర్చు చేశాడట.

‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.’ సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. ఇప్పటి వరకు 75 శాతం షూటింగ్‌ పూర్తి చేశాం. శంకర్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రీకరించిన ఐదు పాటల కోసం ఒక్కో పాటకు రూ.10 నుంచి 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది ఆయన స్టైల్. సినిమా చాలా బాగా వ‌స్తోంది. రామ్ చరణ్ కి బాగా సరిపోయే కథను ఎంచుకుని శంకర్ సినిమా చేస్తున్నాడు’ అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రామ్ చరణ్, శంకర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’కి కూడా దర్శకత్వం వహించాడు. ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ప్రముఖ తెలుగు నటులు సునీల్ శ్రీకాంత్, అంజలి తో పాటు ఎస్ జే సూర్య ఉన్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘పెద్ది’గా రామ్ చరణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.