Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva Teaser: కంగువ టీజర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ విజువల్స్.. మరోసారి సూర్య నటవిశ్వరూపం..

ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‏తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇందులో మరోసారి సూర్య సరికొత్త వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకువచ్చారు మేకర్స్. డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం విజువల్స్, బీజీఎంతోనే గ్లింప్స్ అదరగొట్టారు.

Kanguva Teaser: కంగువ టీజర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ విజువల్స్.. మరోసారి సూర్య నటవిశ్వరూపం..
Kanguva Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 19, 2024 | 6:47 PM

కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న సినిమా కంగువ. ఈ చిత్రాన్ని తమిళ్ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‏తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇందులో మరోసారి సూర్య సరికొత్త వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకువచ్చారు మేకర్స్. డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం విజువల్స్, బీజీఎంతోనే గ్లింప్స్ అదరగొట్టారు.

ఇక విజువల్స్ ప్లస్ బీజీఎం మాత్రం గూస్ బంప్స్ అని చెప్పాలి. అడవి, భయంకరమైన ఆదివాసులు, అడవి జంతువులు, మొసళ్లు, ఖడ్గమృగాలు, సముద్రం షాట్స్ తో మరో కొత్త లోకాన్ని చూపించారు. ఇందులో సూర్య మరింత భయంకరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. సైన్యాన్ని యుద్ధానికి నడిపించే భయంకరమైన.. క్రూరమైన యోధుడిగా సూర్య కనిపించాడు. ఇక ఇందులో సూర్యను ఢీకొట్టేందుకు ప్రతినాయకుడిగా యానిమల్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం కంగువ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసాని విజువల్స్ అందించారు. ఈ సినిమా 3డిలో 38 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు డైరెక్టర్ శివ. ఇందులో బాలీవుడ్ తార దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది. గత రెండేళ్లుగా అడియన్స్ ముందుకు రాలేదు సూర్య. చాలా కాలం తర్వాత ఇప్పుడు కంగువ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పింక్ కలర్ డ్రస్‌లో బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సుప్రీత..
పింక్ కలర్ డ్రస్‌లో బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సుప్రీత..
కొంటె చూపులు.. కవ్వించే నవ్వు..
కొంటె చూపులు.. కవ్వించే నవ్వు..
ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌..!ఇవీ పరీక్షా రూల్స్
ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌..!ఇవీ పరీక్షా రూల్స్
షమీ స్థానంలో డేంజరస్ పేసర్ ఎంట్రీ.. ప్లేయింగ్ 11లో కీలకమార్పు?
షమీ స్థానంలో డేంజరస్ పేసర్ ఎంట్రీ.. ప్లేయింగ్ 11లో కీలకమార్పు?
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..
అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా..ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో
అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా..ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ను ఢీ కొట్టేది ఎవరు?
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ను ఢీ కొట్టేది ఎవరు?
పెను సమస్యగా ఊబకాయం.. పిల్లలు లావుగా మారడానికి కారణం అదేనట..
పెను సమస్యగా ఊబకాయం.. పిల్లలు లావుగా మారడానికి కారణం అదేనట..
ఆటలోనే కాదు.. అందంలోనూ అదరహో.. ఈ బ్లాక్ శారీ క్వీన్ ఎవరో తెలుసా?
ఆటలోనే కాదు.. అందంలోనూ అదరహో.. ఈ బ్లాక్ శారీ క్వీన్ ఎవరో తెలుసా?
రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ..
రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ..