Ram Charan: వైజాగ్ బీచ్లో కూతురు క్లింకారతో రామ్ చరణ్ ఆటలు.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన..
మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ.. క్లింకారతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి సముద్రపు ఒడ్డున రైమ్తో కలిసి ఆడుకున్నారు చరణ్. కూతురి పాదాలను సముద్రపు నీటిలో తాకిస్తూ ఎంజాయ్ చేశారు రామ్. బీచ్లో కూతురితో కలిసి చరణ్ ఆడుకుంటున్న క్షణాలను వీడియోగా క్రియేట్ చేసి బ్యాగ్రౌండ్ లో ఆరెంజ్ సినిమాలోని రూబా రూబా సాంగ్ జత చేసి షేర్ చేశారు ఉపాసన.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమూవీ షూటింగ్ ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటీవలే చరణ్ వైజాగ్ వెళ్లారు. కొన్నిరోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే చరణ్ కోసం కూతురు క్లింకారతో కలిసి ఉపాసన కొణిదెల కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఉపాసన తన ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లింకార, చెర్రీ పెట్ రైమ్తో వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ.. క్లింకారతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి సముద్రపు ఒడ్డున రైమ్తో కలిసి ఆడుకున్నారు చరణ్. కూతురి పాదాలను సముద్రపు నీటిలో తాకిస్తూ ఎంజాయ్ చేశారు రామ్. బీచ్లో కూతురితో కలిసి చరణ్ ఆడుకుంటున్న క్షణాలను వీడియోగా క్రియేట్ చేసి బ్యాగ్రౌండ్ లో ఆరెంజ్ సినిమాలోని రూబా రూబా సాంగ్ జత చేసి షేర్ చేశారు ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత చరణ్ తన కూతురితో కలిసి చిన్నపిల్లాడిలా ఆడుకోవడం చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
చరణ్, క్లింకార వీడియోపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ .. క్యూట్ వీడియో.. చరణ్ ఆన్ డాడీ డ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.కాగా.. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే ఈ సినిమా తర్వాత డైరెక్ట్ర బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నారు. రేపు మార్చి 20న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇక ఇందులో జాన్వీ కపూర్ నటించనుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



